అందుబాటులోకి ఖతార్ బోట్ షో 2026 టికెట్లు.. ధరలు ఇవే..!!
- September 20, 2026
దోహా: ఖతార్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఖతార్ బోట్ షో 2026 టికెట్లు విక్రయానికి అందుబాటులోకి వచ్చాయి. ఓల్డ్ దోహా పోర్ట్ వేదికగా నవంబర్ 4 నుంచి 7 వరకు నాలుగు రోజుల పాటు ఈ బోట్ షో జరగనుంది. ప్రధాని, విదేశాంగ మంత్రి హెచ్‌ఈ షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్‌రహ్మాన్ బిన్ జాసిమ్ అల్ థానీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
ఈ ఏడాది ఖతార్ బోట్ షో మూడో ఎడిషన్. యాచింగ్, సముద్ర రంగానికి సంబంధించిన ఆధునిక సాంకేతికత, లగ్జరీ, వినోదాన్ని ఒకే వేదికపై సందర్శకులకు అందించనున్నారు. ప్రముఖ దేశీయ, అంతర్జాతీయ బ్రాండ్లకు చెందిన కొత్త యాట్లు, బోట్లు, మెరైన్ ఉత్పత్తులను సందర్శకులు వీక్షించవచ్చు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ యాట్, బోట్ తయారీ సంస్థలు, మెరైన్ కంపెనీలు, పరిశ్రమ నిపుణులు, యాచింగ్ ప్రియులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఖతార్ మెరైన్ రంగ అభివృద్ధికి, అంతర్జాతీయ యాచింగ్ గమ్యస్థానంగా దేశానికి మరింత గుర్తింపు తీసుకురావడానికి ఈ షో దోహదపడుతుందని నిర్వాహకులు తెలిపారు.
టికెట్ ధరలు ఇలా..
* ఒక రోజు జనరల్ అడ్మిషన్: QR50
* 4 రోజుల జనరల్ అడ్మిషన్ పాస్: QR160
* హాస్పిటాలిటీ టికెట్: రోజుకు QR450
సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 లేదా 10 గంటల వరకు షోను నిర్వహిస్తారు. QR450 హాస్పిటాలిటీ టికెట్ తీసుకునే వారికి VIP మరియు హాస్పిటాలిటీ లాంజ్, VIP రిజిస్ట్రేషన్ ప్రాంతం, VIP పార్కింగ్ సదుపాయాలు లభిస్తాయి.
తాజా వార్తలు
- సౌదీలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదల అలెర్ట్ జారీ..!!
- సౌదీపై హౌతీ దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- అందుబాటులోకి ఖతార్ బోట్ షో 2026 టికెట్లు.. ధరలు ఇవే..!!
- పెళ్లి రద్దు.. మహిళకు Dh60,000 జరిమానా..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. సలాలా ఎయిర్‌పోర్ట్‌కు పోటెత్తిన ప్రయాణికులు..!!
- కువైట్‌లో ప్రభుత్వ ఉద్యోగులపై తగ్గిన దాడులు..!!
- తెలంగాణ గల్ఫ్ సమితి ఖతార్ ఆధ్వర్యంలో విజయవంతంగా ఉచిత వైద్య శిబిరం
- చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన..టీ20ల్లో సుజీ బేట్స్ రికార్డు బద్దలు
- యూకేలో సిక్కు బస్ డ్రైవర్ పై దాడి..గడ్డం పట్టుకుని లాగి..దారుణం..
- ఏషియన్ గేమ్స్‌లో భారత మహిళల హాకీ జట్టు ఘన విజయం







