ఇతరుల ఐడీలతో సిమ్ వాడుతున్నారా? కేంద్రం DoT హెచ్చరికలు ఇవే!
- September 21, 2026
న్యూ ఢిల్లీ: కేంద్ర టెలికమ్యూనికేషన్స్ శాఖ (DoT) సంచలన హెచ్చరిక జారీ చేసింది. ఇతరుల గుర్తింపు పత్రాలను వారి అనుమతి లేకుండా ఉపయోగించి సిమ్ కార్డులు తీసుకోవడం, టెలికాం గుర్తింపులను దుర్వినియోగం చేయడం, అలాగే మొబైల్ ఐఎంఈఐ (IMEI) నంబర్లలో అక్రమంగా మార్పులు చేయడాన్ని తీవ్రమైన నేరాలుగా పరిగణిస్తామని స్పష్టం చేసింది. ఇటువంటి అక్రమాలకు పాల్పడితే మూడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు ఏకంగా రూ.50 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
ఛత్తీస్‌గఢ్ లో దారుణ మోసం.. రంగంలోకి దిగిన డీఓటీ
ఛత్తీస్‌గఢ్‌లో వెలుగుచూసిన ఒక దారుణ మోసం ఆధారంగా కేంద్రం ఈ కఠిన హెచ్చరికలు జారీ చేసింది. అక్కడ ఉన్న ఒక పాయింట్ ఆఫ్ సేల్ (PoS) ఏజెంట్.. స్థానిక ప్రజలకు ఎలాంటి సమాచారం లేకుండా, వారి గుర్తింపు పత్రాలను ఉపయోగించి అక్రమంగా 25 సిమ్ కార్డులను యాక్టివేట్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే టెలికమ్యూనికేషన్స్ శాఖ, సంబంధిత మొబైల్ సేవల సంస్థలతో కలిసి వేగంగా చర్యలు చేపట్టింది. బాధ్యుడైన పీఓఎస్ ఏజెంట్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టడమే కాకుండా, అతని షాప్ నుండి కొత్త మొబైల్ కనెక్షన్లు జారీ చేయకుండా శాశ్వతంగా నిషేధం విధించింది.
డీఐపీ (DIP) ద్వారా రీ-వెరిఫికేషన్
మోసపూరితంగా పొందిన ఆ 25 మొబైల్ నంబర్లను టెలికం శాఖ ‘డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్’ (DIP) ద్వారా సమగ్రంగా పరిశీలించింది. అనుమానాస్పదంగా ఉన్న కనెక్షన్లకు సంబంధించి వినియోగదారులకు రీ-వెరిఫికేషన్ (మళ్లీ ధ్రువీకరణ) చేపట్టింది. ఈ క్రమంలో సరైన ధ్రువీకరణ ఆధారాలు చూపించని సిమ్ కార్డులను వెంటనే డీయాక్టివేట్ చేసి బంద్ చేశారు. భవిష్యత్తులోనూ ఎవరైనా ప్రజల అనుమతి లేకుండా వారి ఐడీ పత్రాలను దుర్వినియోగం చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని డీఓటీ తేల్చిచెప్పింది.
తాజా వార్తలు
- ఖతార్ గ్రాండ్ ప్రి.. నవంబర్ 28 నుంచి రేసింగ్ సందడి..!!
- డిసెంబర్ 31 నుంచి టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ తప్పనిసరి..!!
- ‘ఫౌండాయో’కు యూఏఈ ఆమోదం.. ప్రపంచంలో మూడో దేశంగా గుర్తింపు..!!
- ముంబై, మస్కట్ ప్రయాణికులపై అదనపు భారం..!
- సౌదీ అరేబియాలో ట్యాక్సీలు, రెంటల్ కార్లకు ఊరట..!!
- బహ్రెయిన్‌లో విదేశీ కార్మికుల వర్క్ పర్మిట్ ఫీజులు పెంపు..!!
- దీపావళి క్రాకర్స్ షాపులకు GHMC కొత్త రూల్స్..
- శ్రీలంకలో కడప ఎన్నారై మహమ్మద్ అరీఫ్‌కు అంతర్జాతీయ పురస్కారం
- 6వ హజ్ కాన్ఫరెన్స్ 2027లో పాల్గొనేందుకు జెడ్డాకు చేరుకున్న భారత ప్రతినిధి బృందం
- దుబాయ్‌లో భారత్–యూఏఈ స్నేహబంధానికి ప్రతీకగా 5 కిలోమీటర్ల ఫిట్నెస్ రన్







