సౌదీ అరేబియాలో ట్యాక్సీలు, రెంటల్ కార్లకు ఊరట..!!

- November 07, 2026 , by Maagulf
సౌదీ అరేబియాలో ట్యాక్సీలు, రెంటల్ కార్లకు ఊరట..!!

రియాద్: సౌదీ అరేబియాలో ట్యాక్సీ సేవలు, ప్రైవేట్ కార్ రెంటల్ సంస్థలకు ప్రభుత్వం ఊరట కల్పించింది. ఈ సేవల్లో వినియోగించే వాహనాల గరిష్ఠ నిర్వహణ కాలపరిమితిని మరో ఆరు నెలల వరకు పొడిగించింది. దీంతో 2026 చివరి నాటికి గడువు ముగిసే వాహనాలను 2027 జూన్ 30 వరకు వినియోగించుకునేందుకు అనుమతి లభించింది.

సౌదీ ట్రాన్స్‌పోర్ట్ జనరల్ అథారిటీ (TGA) ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. ట్యాక్సీ సేవలు, ప్రైవేట్ కార్ల అద్దె కార్యకలాపాల్లో ఉపయోగించే వాహనాలకే ఈ పొడిగింపు వర్తిస్తుంది. 2026 డిసెంబర్ చివరితో అనుమతించిన నిర్వహణ కాలపరిమితి ముగిసే వాహనాలకు అదనంగా ఆరు నెలల గడువు కల్పించారు. వాహనాలను మార్చాల్సిన అవసరం వల్ల సంస్థలపై పడే ఆర్థిక భారాన్ని తగ్గించడంతో పాటు రవాణా సేవల్లో అంతరాయం లేకుండా చూడటమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని TGA వెల్లడించింది. 

ప్రస్తుతం అందుబాటులో ఉన్న వాహనాలను మరింత సమర్థంగా వినియోగించుకోవడానికి, నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని పేర్కొంది. రవాణా రంగానికి సంబంధించిన నిబంధనలను మెరుగుపరచడం, సేవల నిరంతర కొనసాగింపునకు ప్రోత్సాహం అందించడం, ఈ రంగం దీర్ఘకాలిక అభివృద్ధికి తోడ్పడటంలో భాగంగానే గడువు పొడిగించినట్లు ట్రాన్స్‌పోర్ట్ జనరల్ అథారిటీ వివరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com