ఏపీ రాజధాని కోసం మరో 14.36 ఎకరాలు..
- September 21, 2026
అమరావతి: ఆంధ్రప్రదేశ్ కలల రాజధాని అమరావతి నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. రాజధాని విస్తరణ, మౌలిక వసతుల కల్పన కోసం నిర్వహిస్తున్న రెండో విడత భూసమీకరణ (Amaravati Land Pooling) ప్రక్రియకు భూములిచ్చేందుకు రాజధాని ప్రాంత రైతులు ముందుకు వస్తున్నారు. ఇందులో భాగంగా వైకుంఠపురం గ్రామ పరిధిలోని మాదల కుటుంబం తమకు చెందిన 14.365 ఎకరాల భూమిని అమరావతి నిర్మాణం కోసం సీఆర్డీఏ (AP CRDA)కు అందజేసేందుకు అంగీకరించింది. రాజధాని నిర్మణంలో భాగస్వామ్యం కావడం పట్ల ఆ రైతు కుటుంబ సభ్యులు తీవ్ర ఆనందం వ్యక్తం చేశారు.
రాయపూడి కార్యాలయంలో సీఆర్డీఏ అధికారులకు అంగీకార పత్రాలు:
రాయపూడిలోని సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మాదల శ్రీనివాసరావు కుటుంబసభ్యులు సీఆర్డీఏ అదనపు కమిషనర్ కొల్లాబత్తుల కార్తీక్‌కు అధికారిక అంగీకార పత్రాలను అందజేశారు. ఈ సమీకరణలో భాగంగా మాదల శ్రీనివాసరావు నుంచి 4.395 ఎకరాలు, మాదల అప్పారావు నుంచి 4.985 ఎకరాలు, అలాగే మాదల రాంబాబు నుంచి 4.985 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించింది. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఉప కలెక్టర్ బి. కన్యాకుమారి, ఇతర అధికారులు పాల్గొని రైతులకు ధన్యవాదాలు తెలిపారు.
అమరావతి అభివృద్ధికి గ్రామాల ప్రజలు సహకరించాలి:
నవ్యాంధ్ర రాజధాని నగరం ప్రపంచస్థాయి ప్రమాణాలతో రూపుదిద్దుకుంటున్న తరుణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ల్యాండ్ పూలింగ్‌కు భూములిచ్చిన మాదల కుటుంబ సభ్యులు కోరారు. రెండో విడత భూసమీకరణకు అమరావతి పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలు, రైతులు పూర్తిస్థాయిలో సహకరించి రాజధాని అభివృద్ధికి తోడ్పడాలని వారు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా
- ఏపీ రాజధాని కోసం మరో 14.36 ఎకరాలు..
- మెడికల్ విద్యార్థినికి రూ.2 లక్షలు సాయం చేసిన కేటీఆర్
- భారత్-యూఏఈ వాణిజ్య, పెట్టుబడి సంబంధాల బలోపేతం పై చర్చలు
- అక్టోబర్ 8న దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్-15 ప్రారంభం.. టికెట్ ధరలు ఇవే
- ఇరాన్ విమానయాన రంగం పై అమెరికా మరింత ఆంక్షల హెచ్చరిక
- షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మృతికి ప్రెసిడెన్షియల్ కోర్టు సంతాపం
- ఇతరుల ఐడీలతో సిమ్ వాడుతున్నారా? కేంద్రం DoT హెచ్చరికలు ఇవే!
- బహ్రెయిన్‌లో పౌరసంఘాలపై ప్రభుత్వం కీలక ఆదేశాలు..!!







