బ్లడ్ అమ్ముకున్నానని అంటున్నారు.. చిరంజీవి ఆవేదన
- September 22, 2026
హైదరాబాద్: చిరంజీవి 48 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన 'మెగా యూత్ ఫోర్స్' ఫ్యాన్స్ మీట్లో పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌పై వచ్చే ఆరోపణలపై ఘాటుగా స్పందిస్తూ.. తాను సొంత సంపాదనతోనే బ్లడ్ బ్యాంక్ నడుపుతున్నానని, తన రెమ్యునరేషన్‌తో పోలిస్తే ఇవి ఎంత మూర్ఖపు మాటలని కౌంటర్ ఇచ్చారు. ఎన్నో అవమానాలను దాటుకుని ఇక్కడివరకు వచ్చానని తెలిపిన చిరు.. క్రమశిక్షణ, సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవడమే తన విజయానికి, కెరీర్‌కు అసలైన పునాది రాళ్లని అన్నారు.
మెగాస్టార్ చిరంజీవి 48 సంవత్సరాలు సినీ ప్రయాణం పూర్తి చేసుకున్న సందర్భంగా 'మెగా యూత్ ఫోర్స్' ఫ్యాన్స్ మీట్ నిర్వహించారు. దీనికి చిరు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా రక్తం అమ్ముకుంటున్నారనే ఆరోపణలపై ఆయన స్పందించారు. ఎన్ని కోట్ల ప్యాకెట్ల బ్లడ్ అమ్మితే తన రెమ్యునరేషన్‌తో సమానమో చెప్పండంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
''నాకు అవమానాలు లేవనుకుంటున్నారా? బ్లడ్ అమ్ముకుంటున్నాడని అంటుంటారు. నాకొచ్చే రెమ్యునరేషన్‌తో పోలిస్తే ఇదెంత చెప్పండి. ఎన్ని కోట్ల ప్యాకెట్లు అమ్మితే నా రెమ్యునరేషన్‌తో సమానమో చెప్పండి. వాళ్లు అనే మాటలు ఎంత ఫూలిష్‌నెస్. ఎక్కుడా చేయి చాచకుండా, డోనేషన్లు అడగకుండా నా కష్టంతోనే నేను బ్లడ్ బ్యాంక్ నడుపుతున్నాను. దాని వెనకాల నా కష్టం కొంత.. మీరు సహకరించేది ఎంతో. దీనికి విలువకట్టలేము. అందుకే ఇలాంటి ఆరోపణలను నేను పట్టించుకోను'' అని చిరంజీవి అన్నారు.
ప్రతి ఒక్కరూ తాము ఎంచుకున్న రంగంలో క్రమశిక్షణతో ఉంటూ, ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడే ఒక చిరంజీవిలా రాణిస్తారని మెగాస్టార్ అన్నారు. ''డబ్బు తరిగిపోతే తిరిగి సంపాదించుకోవచ్చు. ఈ నిమిషాలు గడిచిపోతుంటే తిరిగి రావు. సమయం చాలా విలువైనది. మనం ఎలా అభివృద్ధి చెందాలో ప్రతి క్షణం ఆలోచించాలి. సమయాన్ని చక్కగా వినియోగించుకోవాలి. చిరంజీవిని ప్రేమించడం కాదు. తను ఎలా పైకి వచ్చాడు? ఎలాంటి ఆలోచనా విధానం, ఆచరణలు పాటించాడు అన్నది చూడాలి. మనం ఎంచుకున్న రంగంలో క్రమశిక్షణ అలవరుకోవాలి. నా మొదటి సినిమా వచ్చిన దగ్గరి ప్రతి క్షణాన్ని వినియోగించుకుని ఇక్కడి వరకూ వచ్చాను. అవన్నీ నా అభివృద్ధికి దోహదపడ్డాయి. అవే నా కెరీర్‌కు పునాది రాళ్లు'' అని చిరంజీవి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక
- కల్బాలో అల్ ఫ్రైష్ సరస్సు ప్రాజెక్టుకు షార్జా రూలర్ ఆమోదం
- హైదరాబాద్‌లో భారీ వర్షం..కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
- 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు ఘన గౌరవం
- మారిషస్ రాష్ట్రపతి చేతుల మీదుగా డా.గజల్ శ్రీనివాస్ ‘శ్రీమద్భగవద్గీత’ ఆల్బమ్ ఆవిష్కరణ
- ఎట్టకేలకు ఏపీలో నంది అవార్డులు..
- షేక్ అహ్మద్‌కు అంతిమ ప్రార్థనలు.. హాజరైన షేక్ మహమ్మద్, పలువురు రాజకుటుంబ సభ్యులు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి







