షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మృతికి సంతాపాలు
- September 23, 2026
దుబాయ్: దివంగత షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మృతిపై దుబాయ్ రూలర్, యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధానమంత్రి షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్‌కు రెండో రోజు కూడా పలువురు సంతాపం తెలిపారు.
షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్, షేక్ మక్తూమ్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్, షేక్ అహ్మద్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ సమక్షంలో జబీల్ మజ్లిస్‌లో సంతాప కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా సోదర, మిత్ర దేశాలకు చెందిన ప్రతినిధులు, షేక్‌లు, మంత్రులు, ఉన్నతాధికారులు, డైరెక్టర్ జనరల్‌లు, ప్రముఖులు, పౌరులు షేక్ మహమ్మద్ బిన్ రషీద్‌ను కలిసి తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
దివంగత షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- 120 మంది కార్మికులకు ఎండ నుంచి రక్షణ పై దుబాయ్ పోలీసుల అవగాహన
- ‘ఇరాన్ ఎప్పటికీ తలవంచదు’..ఐరాసలో అధ్యక్షుడు పెజెష్కియన్
- షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మృతికి సంతాపాలు
- 28న మదురైలో ‘మేనమామ బంగారు ఉంగరం పథకం’ ప్రారంభం
- సీఎం రేవంత్ కి కవిత నెల రోజుల డెడ్‌లైన్
- ‘ఇంటి వద్దకే మీ సేవ’ సర్వీసులు.. ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు..
- భోగాపురం ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీకి నేరుగా విమానాలు: కేంద్ర మంత్రి
- భారత్ వైపు వస్తున్న నౌక పై దాడి.. భారతీయుడు మృతి
- బ్యాంక్ మెల్లీ ఇరాన్ పై UAE సెంట్రల్ బ్యాంక్ కఠిన చర్యలు
- అమరావతిలో ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్‌కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన







