యూఏఈలో డీప్‌ఫేక్ మోసాలపై మహ్రె హెచ్చరిక..!!
- September 24, 2026
దుబాయ్: డీప్‌ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి ప్రభుత్వ అధికారుల పేరుతో జరుగుతున్న మోసాలపై యూఏఈ వాసులను మానవ వనరులు, ఎమిరటైజేషన్ మంత్రిత్వ శాఖ (MOHRE) అప్రమత్తం చేసింది. మంత్రిత్వ శాఖ అధికారులు, ఉద్యోగుల పేరుతో నకిలీ వీడియోలు, వాయిస్ రికార్డింగులు, చిత్రాలను రూపొందించి ప్రజలను మోసం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని హెచ్చరించింది. వీడియో లేదా వాయిస్ మెసేజులు నిజమైనదిగా కనిపించినంత మాత్రాన దాన్ని నమ్మవద్దని MOHRE సూచించింది.
డీప్‌ఫేక్ సాంకేతికతతో అధికారుల ముఖాలు, గొంతులను కృత్రిమంగా అనుకరించి.. వ్యక్తిగత వివరాలు, బ్యాంకింగ్ సమాచారం పొందడం, అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయించడం లేదా డబ్బులు బదిలీ చేయించడం వంటి మోసాలకు పాల్పడే అవకాశం ఉందని తెలిపింది. సైబర్ మోసగాళ్లు మంత్రిత్వ శాఖ లేదా దాని అధికారులు, ఉద్యోగుల నుంచి వచ్చినట్లుగా కనిపించేలా నకిలీ కంటెంట్‌ను రూపొందించవచ్చని MOHRE పేర్కొంది. అత్యవసర ప్రకటనలు లేదా తక్షణ చర్య తీసుకోవాలంటూ ఒత్తిడి చేసే సందేశాల ద్వారా ప్రజలను మోసం చేసే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఎలా రక్షించుకోవాలి?
అనుకోకుండా వచ్చే వీడియో, వాయిస్ మెసేజ్ లేదా MOHRE పేరుతో వచ్చే అభ్యర్థనలను స్వీకరించినప్పుడు అప్రమత్తంగా ఉండాలని మంత్రిత్వ శాఖ సూచించింది.
- వీడియో లేదా వాయిస్ నిజమైనదిగా కనిపించినా వెంటనే నమ్మవద్దు.
- ఏదైనా అభ్యర్థన లేదా ప్రకటనను MOHRE అధికారిక మార్గాల ద్వారా ధృవీకరించుకోండి.
- ధృవీకరించని సందేశాలు లేదా ఫోన్ కాల్స్‌కు వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలను ఇవ్వవద్దు.
- ఏదైనా లింక్‌పై క్లిక్ చేసే ముందు దాని ప్రామాణికతను నిర్ధారించుకోండి.
మెసేజ్ లేదా కాల్‌పై అనుమానం ఉంటే స్పందించకుండా.. MOHRE కాంటాక్ట్ సెంటర్‌ను సంప్రదించి, సందేశం లేదా తమను మంత్రిత్వ శాఖ ప్రతినిధులుగా పరిచయం చేసుకున్న వ్యక్తుల వివరాలను ధృవీకరించుకోవాలని సూచించింది. ముఖాలు, వాయిస్ లను అనుకరించే సామర్థ్యం ఉన్న కొత్త సాంకేతికతలు అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో.. వ్యక్తిగత సమాచారం, డబ్బును కాపాడుకోవడానికి అధికారిక మార్గాల ద్వారా సమాచారాన్ని ధృవీకరించుకోవడమే అత్యంత ముఖ్యమైన జాగ్రత్త అని MOHRE గుర్తుచేసింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో షేర్డ్ హౌసింగ్ లీజు ముందే ముగిస్తే.. అద్దె రీఫండ్‌కు అవకాశం..!!
- సౌదీలో దాడులపై మక్కా రక్షణ ఒప్పంద దేశాలు ఆగ్రహం..!!
- 2027లో బెస్ట్ ట్రావెల్ డెస్టినేషన్లలో ఒమన్..!!
- కువైట్‌లో ఫైర్ ఫోర్స్ కొత్త వాట్సాప్ సర్వీస్..!!
- బహ్రెయిన్‌లో డైవింగ్ సెంటర్లలో తనిఖీలు..!!
- ఎల్డీసీలకు అంతర్జాతీయ మద్దతు పెంచాలి: ఖతార్
- యూఏఈ: భారతీయ సంఘాల ప్రతినిధులతో భారత విదేశాంగ శాఖ కార్యదర్శి శ్రీప్రియ రంగనాథన్ భేటీ
- మహాత్మా గాంధీకి శ్రద్ధాంజలి అర్పించిన భారత విదేశాంగ శాఖ కార్యదర్శి శ్రీప్రియ రంగనాథన్
- సౌదీ అరేబియా పై హౌతీల బాలిస్టిక్ క్షిపణుల దాడి యత్నం..
- పరిస్థితులు ప్రతిభకు అడ్డంకులు కావు: గవర్నర్ శివప్రతాప్ శుక్లా







