అల్ వుస్తా, సౌత్ అల్ షర్కియా గవర్నరేట్లలో సుల్తాన్ పర్యటన..!!
- September 24, 2026
మస్కట్: ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ అల్ వుస్తా, సౌత్ అల్ షర్కియా గవర్నరేట్ల పరిధిలోని పలు విలాయత్‌లలో ఫీల్డ్ టూర్‌ను ప్రారంభించారు. అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని ప్రత్యక్షంగా పరిశీలించడం, సామాజిక సేవలను మెరుగుపరచడం, స్థానిక ఆర్థిక, పర్యాటక రంగాల సామర్థ్యాన్ని మరింత వినియోగించుకోవడం లక్ష్యంగా ఈ పర్యటన కొనసాగుతోంది.
పర్యటనలో భాగంగా సుల్తాన్ దుక్మ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (SEZAD), దుక్మ్ పోర్ట్ ను సందర్శించారు. అక్కడ మౌలిక వసతుల విస్తరణ, భవిష్యత్ పెట్టుబడి వ్యూహాలపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు.
దుక్మ్ పోర్ట్‌కు సుల్తాన్ చేరుకున్న సందర్భంగా స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అండ్ ఫ్రీ జోన్స్ పబ్లిక్ అథారిటీ చైర్మన్‌తో పాటు పోర్ట్, జోన్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న వివిధ కంపెనీల అధికారులు ఆయనకు స్వాగతం పలికారు.
దుక్మ్ ప్రత్యేక ఆర్థిక మండలి వ్యూహాత్మక భౌగోళిక స్థానాన్ని మరింత సమర్థవంతంగా వినియోగించుకోవాలని సుల్తాన్ హైతమ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రాంతాన్ని ప్రాంతీయ ఆర్థిక, లాజిస్టిక్స్ హబ్‌గా మరింత అభివృద్ధి చేయడంతో పాటు స్థానిక, విదేశీ పెట్టుబడులను ఆకర్షించే చర్యలను కొనసాగించాలని సూచించారు.
వివిధ విలాయత్‌లలో జరుగుతున్న అభివృద్ధి ప్రాజెక్టులు, కార్యక్రమాల పురోగతిని ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు. అలాగే పౌరులు, నివాసితులకు అందుతున్న అభివృద్ధి, సేవలను మెరుగుపరిచేందుకు వారి అవసరాలు, అభిప్రాయాలను తెలుసుకోవడంపై కూడా సుల్తాన్ దృష్టి సారించనున్నారు.
తాజా వార్తలు
- ఎన్నిక ఏదైనా కూటమిదే ఘనవిజయం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్ మెరీనాలో 670 మంది కార్మికులకు భద్రత, సామాజిక అవగాహన కార్యక్రమాలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్‌లు విడుదల.. పరిమిత సంఖ్యలో విక్రయాలు
- గల్ఫ్ ప్రవాసులకు ఆన్లైన్లో ఓపెన్ యూనివర్సిటీ కోర్సులు
- OMCAP ఆధ్వర్యంలో జర్మనీలో ఉద్యోగాలకు 55 మంది ఏపీ నర్సుల ఎంపిక..
- మారిషస్ స్టేట్ హౌస్‌లో డా.గజల్ శ్రీనివాస్ గానం
- తెలంగాణను దేశంలో అగ్రశ్రేణి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతాం: మంత్రి జూపల్లి
- ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ హస్తకళలకు కొత్త ఊపిరి పోస్తున్న లేపాక్షి
- తెలంగాణ జైళ్ల శాఖకు అరుదైన గౌరవం.. 109వ స్కోచ్ అవార్డు
- యూఏఈలో ఫేక్ లాటరీ స్కామ్.. Dh84,000 కోల్పోయిన వ్యక్తి..!!







