గ్లోబల్ పోటీతత్వంలో సౌదీ అరేబియాకు 13వ స్థానం..!!
- September 25, 2026
రియాద్: 2026 IMD వరల్డ్ కాంపిటీటివ్నెస్ ఇయర్‌బుక్ లో సౌదీ అరేబియా మెరుగైన ర్యాంక్ సాధించింది. మొత్తం 70 దేశాల్లో 13వ స్థానంలో నిలిచిన సౌదీ.. G20 దేశాల్లో మూడో స్థానాన్ని దక్కించుకుంది. అమెరికా, చైనా తర్వాత సౌదీ అరేబియా G20లో మూడో స్థానంలో ఉంది. వాణిజ్య మంత్రిత్వ శాఖకు సంబంధించిన పలు సూచీల్లో కూడా సౌదీ అరేబియా ప్రపంచస్థాయిలో ఉన్నత స్థానాలు సాధించింది.
కీలక సూచీల్లో సౌదీ కొత్త సంస్థల స్థాపన (Creation of Firms)లో 3వ స్థానం, సమాన అవకాశాలు (Equal Opportunity)లో 4వ స్థానం, పెద్ద సంస్థలు (Large Corporations)లో 7వ స్థానం పొందింది. గత ఏడాది ర్యాంకింగ్‌తో పోలిస్తే కొత్త సంస్థల స్థాపనలో ఒక స్థానం, సమాన అవకాశాల్లో మూడు స్థానాలు, పెద్ద సంస్థల విభాగంలో రెండు స్థానాలు సౌదీ మెరుగుపరుచుకుంది.
110 నిబంధనల్లో మార్పులు
వ్యాపార కార్యకలాపాలను సులభతరం చేయడం, వాణిజ్య సంస్థల వృద్ధి, విస్తరణకు అవకాశాలు కల్పించడం, చట్టపరమైన వ్యవస్థను మెరుగుపరచడం వంటి చర్యల ద్వారా ఈ పురోగతి సాధించినట్లు సౌదీ అధికారులు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల భాగస్వామ్యంతో మొత్తం 110 నిబంధనలు, చట్టాలను సమీక్షించి అభివృద్ధి చేసినట్లు వెల్లడించారు.
వీటిలో ప్రధానంగా కంపెనీల చట్టం, దాని నిబంధనలు, కమర్షియల్ రిజిస్టర్ చట్టం, ట్రేడ్ నేమ్స్ చట్టం, ఫ్రాంచైజ్ చట్టం, ఈ-కామర్స్ చట్టం, కమర్షియల్ కోర్టుల చట్టం, మూవబుల్ ప్రాపర్టీ సెక్యూరింగ్ చట్టం, దివాలా చట్టం, విలువైన లోహాలు, రత్నాల చట్టానికి సంబంధించిన అమలు నిబంధనలు ఉన్నాయి.
వ్యాపార వాతావరణాన్ని మరింత సులభతరం చేయడం, పెట్టుబడులకు అనుకూల పరిస్థితులు కల్పించడం, కంపెనీల విస్తరణకు మద్దతు ఇవ్వడం వంటి లక్ష్యాలతో ఈ నిబంధనలలో మార్పులు చేసినట్లు సౌదీ అరేబియా తెలిపింది.
తాజా వార్తలు
- flydubai becomes first airline to launch scheduled international flights to Pokhara
- యూఎన్‌లో పాక్-బంగ్లా కీలక భేటీ
- విశాఖలో విషాదం.. ఆంధ్ర మెడికల్ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య
- జల మార్గాల భద్రత, పౌరుల రక్షణ.. ఐరాసలో బహ్రెయిన్ కీలక వ్యాఖ్యలు..!!
- నాటో చీఫ్, ఐర్లాండ్ ప్రధాని తో కువైట్ క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- గ్లోబల్ పోటీతత్వంలో సౌదీ అరేబియాకు 13వ స్థానం..!!
- ఖతార్‌లో పూర్తి డిజిటలైజేషన్ దిశగా మారిటైమ్ రంగం..!!
- గాజా కోసం 1 కోటి భోజనాల కార్యక్రమానికి కొత్త పేరు..!!
- ఉద్యోగులపై డబ్బులు విసిరిన వైరల్ వీడియోలు.. ఒమన్ పోలీసుల చర్యలు..!!
- యూఎన్‌లో నెతన్యాహు స్పీచ్.. ఒక్కసారిగా ఖాళీ అయిన కుర్చీలు..







