ఉద్యోగులపై డబ్బులు విసిరిన వైరల్ వీడియోలు.. ఒమన్ పోలీసుల చర్యలు..!!

- September 25, 2026 , by Maagulf
ఉద్యోగులపై డబ్బులు విసిరిన వైరల్ వీడియోలు.. ఒమన్ పోలీసుల చర్యలు..!!

మస్కట్: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రెండు వీడియోలపై రాయల్ ఒమన్ పోలీస్ (ROP) చర్యలు చేపట్టింది. విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులపై ప్రవాసులు డబ్బులు విసురుతున్నట్లు ఈ వీడియోల్లో కనిపించింది.

పోలీసుల వివరాల ప్రకారం.. ఒక వీడియోలో ఓ ప్రవాసుడు విధుల్లో ఉన్న ఉద్యోగిపై డబ్బులు విసిరినట్లు కనిపించింది. మరో వీడియోలో కూడా మరో ప్రవాసుడు విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా ఉద్యోగిపై ఇదే విధంగా డబ్బులు విసిరినట్లు చూపించారు.

అయితే మహిళా ఉద్యోగికి సంబంధించిన రెండో వీడియో వాస్తవ ఘటన కాదని పోలీసులు స్పష్టం చేశారు. అవగాహన కల్పించేందుకు ఉద్దేశపూర్వకంగా చిత్రీకరించిన సన్నివేశమని, మహిళా ఉద్యోగి మరియు ఆమెతో ఉన్న వ్యక్తులు ఇచ్చిన ప్రకటనలో ఈ విషయం వెల్లడైందని తెలిపారు.

ఈ రెండు ఘటనలకు సంబంధించిన వీడియోల్లో పాల్గొన్న వారందరిపై చట్టపరమైన చర్యల ప్రక్రియ కొనసాగుతోందని రాయల్ ఒమన్ పోలీసులు తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com