లండన్‌లో ‘లివ్ ఒమన్’ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- September 26, 2026
మస్కట్: ఒమన్‌ను నివాసం, పెట్టుబడులకు అనుకూల గమ్యస్థానంగా పరిచయం చేసేందుకు ‘లివ్ ఒమన్’ ఎగ్జిబిషన్‌ను లండన్‌లో ప్రారంభించారు. ఆక్స్‌ఫర్డ్ స్ట్రీట్‌లోని ‘ఫ్యూచర్ స్టోర్’లో ఈ ప్రదర్శన ప్రారంభమైంది. ఒమన్ హౌసింగ్ అండ్ అర్బన్ ప్లానింగ్ మంత్రి డాక్టర్ ఖల్ఫాన్ బిన్ సయీద్ అల్ షైలీ ఆధ్వర్యంలో ఈ ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. ఒమన్‌లో అభివృద్ధి చెందుతున్న భవిష్యత్ నగరాలు, పట్టణాభివృద్ధి ప్రాజెక్టులు, నివాస అవకాశాలు, జీవన ప్రమాణాలను లండన్‌లోని పెట్టుబడిదారులు, సందర్శకులకు పరిచయం చేయడం దీని ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.
లండన్‌లో ఒమన్ ప్రదర్శనను ‘Invest in Oman, Discover Oman, Live Oman’ అనే మూడు ప్రధాన అంశాల చుట్టూ నిర్వహిస్తున్నారు. ఒమన్‌లో కొనసాగుతున్న సుల్తాన్ హైథమ్ సిటీ, అల్ థురయ్యా సిటీ, అల్ ఖువైర్ డౌన్‌టౌన్, అల్ జబల్ అల్ ఆలి వంటి ప్రాజెక్టులను ఎగ్జిబిషన్‌లో ప్రదర్శిస్తున్నారు. ఈ ప్రాజెక్టులు కేవలం ఆస్తుల కొనుగోలు అవకాశాలకే పరిమితం కావని, ఒమన్‌లోని జీవన ప్రమాణాలు, సాంస్కృతిక వారసత్వం, ప్రకృతి వైవిధ్యం, భద్రత, స్థిరత్వం, ఆసియా–యూరప్–ఆఫ్రికా మార్కెట్లకు అనుసంధానించే వ్యూహాత్మక భౌగోళిక స్థానం వంటి అంశాలను కూడా పెట్టుబడిదారులకు వివరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఆస్తి యాజమాన్యం, పెట్టుబడులకు సంబంధించిన నిబంధనలను మరింత సులభతరం చేయడం, చట్టపరమైన మార్పులు ఒమన్ రియల్ ఎస్టేట్ రంగాన్ని పెట్టుబడిదారులకు ఆకర్షణీయంగా మారుస్తున్నాయని మంత్రి తెలిపారు. అర్హత కలిగిన పెట్టుబడిదారులు, వారి కుటుంబాలకు అందుబాటులో ఉన్న దీర్ఘకాలిక నివాస సదుపాయాలు కూడా ఒమన్‌లో స్థిరపడాలనుకునే వారికి ముఖ్యమైన అంశంగా పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కాంగోలో కుప్పకూలిన విమానం..14 మంది మృతి
- బహ్రెయిన్ చారిత్రక ప్రాంతాల పునరుద్ధరణకు చర్యలు..!!
- ఖతార్‌లో తాత్కాలికంగా ట్రాఫిక్ ఆంక్షలు.. వాటర్ లైన్ నిర్వహణ పనులు..!!
- లండన్‌లో ‘లివ్ ఒమన్’ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- సౌదీ అరేబియాకు రక్షణగా..మక్కా ఒప్పందం అమలుపై కీలక నిర్ణయం..!!
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు..!!
- దుబాయ్‌లో అనధికార ఆక్యుపెన్సీపై కఠిన చర్యలు..!!
- గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి: డీజీపీ సీవీ ఆనంద్
- ఆసియా క్రీడల విజేతలకు సీఎం విజయ్ భారీ నగదు బహుమతి
- హత్యకు గురైన వ్యక్తి భార్య, కుమారుడు అదృశ్యమయ్యారన్న వార్తలను ఖండించిన షార్జా పోలీసులు







