కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు..!!

- September 26, 2026 , by Maagulf
కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు..!!

కువైట్: రహదారులపై ప్రమాదకరంగా వాహనాలు నడుపుతూ ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగించిన నలుగురిని కువైట్ జనరల్ ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ అరెస్ట్ చేసింది. వఫ్రా వ్యవసాయ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వఫ్రా ప్రాంతంలో కొందరు యువకులు ర్యాష్ డ్రైవింగ్ స్టంట్స్ చేస్తున్నారన్న సమాచారంతో ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన సెక్యూరిటీ కంట్రోల్ విభాగం నిఘా చేపట్టింది.  స్టంట్స్‌కు ఉపయోగించిన వాహనాలను పలు ఫార్మ్‌లలో దాచినట్లు అధికారులు గుర్తించారు.అనంతరం పబ్లిక్ అథారిటీ ఫర్ అగ్రికల్చర్ అఫైర్స్ అండ్ ఫిష్ రిసోర్సెస్ (PAAFR) సహకారంతో దాడులు నిర్వహించి 5 వాహనాలను స్వాధీనం చేసుకుని, నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.

అరెస్ట్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని సెంట్రల్ జైలుకు తరలించారు. అనంతరం చట్టపరమైన ప్రక్రియలు పూర్తైన తర్వాత, ర్యాష్ మరియు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, ఇతర రోడ్డు వినియోగదారుల ప్రాణాలకు ప్రమాదం కలిగించినందుకు ట్రాఫిక్ చట్టంలోని ఆర్టికల్ 33 బిస్ కింద ఐదు వాహనాలను ధ్వంసం చేశారు.

రహదారులపై ప్రజల ప్రాణాలు, ఆస్తులకు ప్రమాదం కలిగించే వారికి ఎలాంటి మినహాయింపులు లేకుండా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని జనరల్ ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ స్పష్టం చేసింది. రోడ్డు వినియోగదారుల భద్రత కోసం ఇటువంటి ప్రమాదకర డ్రైవింగ్‌పై నిఘా, తనిఖీలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com