సౌదీ అరేబియాకు రక్షణగా..మక్కా ఒప్పందం అమలుపై కీలక నిర్ణయం..!!
- September 26, 2026
రియాద్: సౌదీ అరేబియా, పాకిస్థాన్, టర్కియే దేశాల రక్షణ దళాల అధిపతులు రియాద్‌లో సమావేశమయ్యారు. మక్కా సంయుక్త రక్షణ ఒప్పందం ప్రకారం సమిష్టి రక్షణకు తమ నిబద్ధతను మరోసారి స్పష్టం చేశారు. ఒప్పందంలోని అంశాలను తక్షణమే అమలు చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో సౌదీ అరేబియాకు ఎదురవుతున్న భద్రతా పరిస్థితులు, ముప్పులపై మూడు దేశాల సైనికాధికారులు చర్చించారు. మక్కాపై జరిగిన దాడులతో పాటు సౌదీ అరేబియాలోని పౌర, ఆర్థిక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్న దాడులను వారు తీవ్రంగా ఖండించారు. సౌదీ పౌరులు, నివాసితుల భద్రతతో పాటు దేశ రక్షణలో సౌదీ సాయుధ దళాలు చూపుతున్న అప్రమత్తత, వృత్తి నైపుణ్యాన్ని మూడు దేశాల అధికారులు ప్రశంసించారు.
నిఘా, సైనిక సమన్వయంపై దృష్టి
మూడు దేశాల సాయుధ దళాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై సమావేశంలో చర్చించారు. సౌదీ అరేబియా, పాకిస్థాన్, టర్కియే ప్రజలు, సాయుధ దళాల మధ్య చాలా కాలంగా కొనసాగుతున్న సంబంధాలు, పరస్పర విశ్వాసాన్ని కూడా సమావేశంలో ప్రస్తావించారు. రియాద్‌లో జరిగిన ఈ సమావేశం మూడు దేశాల రక్షణ భాగస్వామ్యానికి ప్రతిబింబమని అధికారులు పేర్కొన్నారు. మక్కా సంయుక్త రక్షణ ఒప్పందంలోని హామీలను తక్షణమే ఆచరణాత్మక సైనిక సహకారంగా మార్చేందుకు మూడు దేశాలు సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- కాంగోలో కుప్పకూలిన విమానం..14 మంది మృతి
- బహ్రెయిన్ చారిత్రక ప్రాంతాల పునరుద్ధరణకు చర్యలు..!!
- ఖతార్‌లో తాత్కాలికంగా ట్రాఫిక్ ఆంక్షలు.. వాటర్ లైన్ నిర్వహణ పనులు..!!
- లండన్‌లో ‘లివ్ ఒమన్’ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- సౌదీ అరేబియాకు రక్షణగా..మక్కా ఒప్పందం అమలుపై కీలక నిర్ణయం..!!
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు..!!
- దుబాయ్‌లో అనధికార ఆక్యుపెన్సీపై కఠిన చర్యలు..!!
- గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి: డీజీపీ సీవీ ఆనంద్
- ఆసియా క్రీడల విజేతలకు సీఎం విజయ్ భారీ నగదు బహుమతి
- హత్యకు గురైన వ్యక్తి భార్య, కుమారుడు అదృశ్యమయ్యారన్న వార్తలను ఖండించిన షార్జా పోలీసులు







