ఖతార్‌లో తాత్కాలికంగా ట్రాఫిక్ ఆంక్షలు.. వాటర్ లైన్ నిర్వహణ పనులు..!!
- September 26, 2026
దోహా:వాటర్ లైన్ నిర్వహణ పనుల నేపథ్యంలో ఖతార్ జనరల్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ కార్పొరేషన్ (KAHRAMAA) కీలక ట్రాఫిక్ మార్పును ప్రకటించింది. దుఖాన్ రోడ్ వైపు వెళ్లే వెస్ట్‌బౌండ్ రహదారిలో కుడివైపు ఉన్న మూడు లేన్లను తాత్కాలికంగా మూసివేయనున్నారు. ఈ తాత్కాలిక మూసివేత నేటి నుంచి సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉంటుంది. నీటి సరఫరా లైన్‌కు సంబంధించిన నిర్వహణ పనులు చేపట్టేందుకు ఈ ట్రాఫిక్ మూసివేత అవసరమైందని KAHRAMAA తెలిపింది. ఈ పనులు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ సమన్వయంతో నిర్వహిస్తున్నట్లు పేర్కొంది.
మూసివేత సమయంలో వాహనదారులు తాత్కాలిక ట్రాఫిక్ మళ్లింపులను పాటించాలని అధికారులు సూచించారు. అలాగే అధికారులు సూచించిన ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని కోరారు. ట్రాఫిక్ అంతరాయం కారణంగా ప్రయాణ సమయం పెరిగే అవకాశం ఉన్నందున, ఈ మార్గంలో వెళ్లే వాహనదారులు ముందుగానే తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవడం మంచిదని పేర్కొన్నది.
తాజా వార్తలు
- కాంగోలో కుప్పకూలిన విమానం..14 మంది మృతి
- బహ్రెయిన్ చారిత్రక ప్రాంతాల పునరుద్ధరణకు చర్యలు..!!
- ఖతార్‌లో తాత్కాలికంగా ట్రాఫిక్ ఆంక్షలు.. వాటర్ లైన్ నిర్వహణ పనులు..!!
- లండన్‌లో ‘లివ్ ఒమన్’ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- సౌదీ అరేబియాకు రక్షణగా..మక్కా ఒప్పందం అమలుపై కీలక నిర్ణయం..!!
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు..!!
- దుబాయ్‌లో అనధికార ఆక్యుపెన్సీపై కఠిన చర్యలు..!!
- గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి: డీజీపీ సీవీ ఆనంద్
- ఆసియా క్రీడల విజేతలకు సీఎం విజయ్ భారీ నగదు బహుమతి
- హత్యకు గురైన వ్యక్తి భార్య, కుమారుడు అదృశ్యమయ్యారన్న వార్తలను ఖండించిన షార్జా పోలీసులు







