బెల్టు బాంబు పేల్చుకోవడానికి సిద్ధమైన బాలుడు
- August 23, 2016
ఇరాక్‌లోని కిర్కుక్ పట్టణంలో బెల్టు బాంబు పేల్చుకోవడానికి సిద్ధమైన బాలుణ్ని పోలీసులు అడ్డుకున్న దృశ్యాలు స్థానిక టీవీ చానెళ్లలో ప్రసారమయ్యాయి. ఇద్దరు పోలీసులు అతణ్ని గట్టిగా పట్టుకోగా ఒకరు బెల్టు బాంబును తొలగించారు. తరువాత బాలుణ్ని పోలీసు ట్రక్కులో ఎక్కించుకుని అక్కడి నుంచి తీసుకెళ్లారు. పోలీసులు సకాలంలో అతడిని గుర్తించడంతో పెద్ద ముప్పు తప్పింది. బాలుడి వయస్సు కచ్చితంగా వెల్లడించలేదు. తీవ్రవాదులు బాలుడిని కిడ్నాప్ చేసి మానవ బాంబుగా తయారుచేసినట్టు కిర్కుక్ పోలీసులు వెల్లడించారు. ఆత్మాహుతి దాడి చేసేందుకు అతడిపై తీవ్రవాదులు ఒత్తిడి తెచ్చారని తెలిపారు.స్థానిక మసీదుపై ఆత్మాహుతి దాడి జరిగిన కొద్దిసేపటికే బాలుడు పట్టుబడడం గమనార్హం.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







