రమ్య వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి..
- August 23, 2016
పొరుగుదేశం పాకిస్థాన్‌ను పొగుడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కన్నడ నటి, మాజీ ఎంపీ రమ్యపై దేశద్రోహం కేసు నమోదైంది. కర్ణాటకలోని మదికేరీలో కత్నమణె విట్టల్ గౌడ అనే న్యాయవాది ఆమెపై కేసు పెట్టారు. శనివారం ఈ కేసు విచారణకు రానుంది.ఇటీవల పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరిగిన సార్క్ కార్యక్రమానికి రమ్య హాజరయ్యారు. తిరిగి భారత్‌కు చేరుకున్న అనంతరం ఆమె మాట్లాడుతూ.. 'కొందరు అన్నట్లుగా పాకిస్థాన్ నరకమేమీ కాదు. అక్కడి ప్రజలంతా మనలాంటివారే. మమ్మల్ని వారు ఎంతో బాగా చూసుకున్నారు' అంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే రమ్య వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.పాకిస్థాన్‌ను పొగిడేలా మాట్లాడారంటూ ఆమెపై కొందరు విమర్శలు చేశారు.కన్నడంతో పాటు పలు భాషల్లో నటించిన రమ్య.. 2011లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇటీవల పాక్, భారత్ మధ్య విభేదాల నేపథ్యంలో కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్.. ఆ దేశాన్ని నరకంతో పోల్చిన విషయం తెలిసిందే. ఇస్లామాబాద్‌లో జరిగిన సార్క్ దేశాల సమావేశానికి హాజరైన హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కూడా పాక్ వైఖరిని ఖండించారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







