సౌదీలో వాణిజ్య మంత్రిత్వ శాఖ విస్తృత తనిఖీలు..!!
- September 26, 2026
రియాద్: సౌదీ అరేబియా వాణిజ్య మంత్రిత్వ శాఖ 2026లో తొలి తొమ్మిది నెలల్లో భారీ స్థాయిలో తనిఖీలు నిర్వహించింది. ఈ కాలంలో 3,83,000 తనిఖీలు చేపట్టడంతో పాటు, వినియోగదారుల నుంచి వచ్చిన 4,43,000 ఫిర్యాదులు, నివేదికలను పరిష్కరించినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నియంత్రణ, అమలు చర్యలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగాన్ని విస్తరించినట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది.
2.22 లక్షల వాహనాలు రీకాల్
వినియోగదారుల భద్రతలో భాగంగా సెప్టెంబర్ వరకు 58 రీకాల్ క్యాంపెయిన్లు నిర్వహించారు. వీటి పరిధిలో మొత్తం 2,22,410 వాహనాలు, ఇతర ఉత్పత్తులు 8,508 ఉన్నాయి. వాణిజ్య ఫిర్యాదులను విశ్లేషించేందుకు, తనిఖీ బృందాలను అవసరమైన ప్రాంతాలకు మళ్లించేందుకు AI ఆధారిత వ్యవస్థలను ఉపయోగిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
బంగారం, విలువైన రాళ్ల రంగంపై ప్రత్యేక నిఘా
బంగారం, విలువైన లోహాలు, రత్నాల రంగంలో రిస్క్ ఆధారిత పర్యవేక్షణను మరింత బలోపేతం చేసినట్లు అధికారులు తెలిపారు. నిబంధనల ఉల్లంఘనకు ఎక్కువ అవకాశం ఉన్న ప్రాంతాలు, సంస్థలపై ప్రత్యేక దృష్టి సారించే విధానాన్ని అమలు చేస్తున్నారు.
వాణిజ్య ముసుగుపై 34 వేలకుపైగా తనిఖీలు
వాణిజ్య ముసుగు (Commercial Concealment)ను అరికట్టేందుకు 13 ప్రభుత్వ సంస్థలు కలిసి సెప్టెంబర్ 2026 వరకు 34,000కు పైగా తనిఖీలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో 1,066 ప్రాథమిక అనుమానిత వాణిజ్య ముసుగు కేసులు, మార్కెట్ నిబంధనలకు సంబంధించిన 77 ఉల్లంఘనలు నమోదైనట్లు డేటా వెల్లడించింది.
AIతో అక్రమాల గుర్తింపు
వాణిజ్య ముసుగును అరికట్టే జాతీయ కార్యక్రమం కూడా అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించేందుకు AI ఆధారిత కమర్షియల్ కన్సిల్ మెంట్ ఇండికేటర్ ను అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అనుమానాస్పద వాణిజ్య ముసుగు కేసులను ఆన్లైన్లో నివేదించేందుకు, తనిఖీ బృందాలను సంబంధిత ప్రాంతాలకు పంపేందుకు ప్రత్యేక ఎలక్ట్రానిక్ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే యాంటీ-కన్సీల్మెంట్ చట్టం కింద ఉల్లంఘనలకు పాల్పడిన వారి పరిస్థితిని చట్టబద్ధంగా సరిదిద్దుకునే విధానాలకు సంబంధించిన నిబంధనలను కూడా జారీ చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- యూఏఈలో ఫేక్ లాటరీ స్కామ్.. Dh84,000 కోల్పోయిన వ్యక్తి..!!
- యానిమల్స్ పై క్రూరత్వానికి BD100,000 వరకు ఫైన్.. ఐదేళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో హలాల్ సర్టిఫికెట్లపై కీలక నిబంధనలు..!!
- ఓపెన్ఏఐ ఏఐ ఏజెంట్ల నిర్వాకం.. ఆన్లైన్లో యూజర్ల ఫోటోలు..!!
- సౌదీలో వాణిజ్య మంత్రిత్వ శాఖ విస్తృత తనిఖీలు..!!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు ముమ్మరం..!!
- ఉద్యోగ మోసం ఆరోపణలు: కేరళలో సంస్థ యజమాని అదుపులోకి తీసుకున్నా.. సాధారణంగానే కార్యకలాపాలు
- న్యూయార్క్‌లో భారత్–జీసీసీ ట్రోయికా మంత్రుల సమావేశం
- హైదరాబాద్‌లో రాపిడో ఫుడ్ డెలివరీ.. ‘ఓన్లీ’ యాప్ ప్రారంభం
- కాంగోలో కుప్పకూలిన విమానం..14 మంది మృతి







