ఒమన్‌లో హలాల్ సర్టిఫికెట్లపై కీలక నిబంధనలు..!!
- September 26, 2026
మస్కట్: దిగుమతి చేసుకునే ఆహార ఉత్పత్తులకు సంబంధించిన హలాల్ సర్టిఫికెట్ల విషయంలో ఒమన్ కీలక మార్పు చేసింది. ఒమన్ ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ సెంటర్ (FSQC) గుర్తింపు పొందని సంస్థలు జారీ చేసిన హలాల్ సర్టిఫికెట్లను 2027 జూలై 1 నుంచి అంగీకరించబోమని ప్రకటించింది. హలాల్ సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండే ఆహార ఉత్పత్తులను దిగుమతి చేసుకునే వ్యాపారులు ఈ నిబంధనను దృష్టిలో ఉంచుకోవాలని FSQC సూచించింది.
సర్టిఫికేషన్ సంస్థలకు గడువు
దిగుమతిదారులు తమ సరఫరాదారులు, ఆయా దేశాల్లోని హలాల్ సర్టిఫికేషన్ సంస్థలతో ముందుగానే సమన్వయం చేసుకోవాలని కేంద్రం సూచించింది. హలాల్ సర్టిఫికెట్లు జారీ చేసే సంస్థలు FSQC నిర్దేశించిన గుర్తింపు ప్రక్రియను గడువులోగా పూర్తి చేశాయా లేదా నిర్ధారించుకోవాలని తెలిపింది. సర్టిఫికేషన్ సంస్థలు FSQC గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోవడానికి లేదా అవసరమైన నిబంధనల గురించి తెలుసుకోవడానికి మెయిల్ ([email protected]) ద్వారా సంప్రదించవచ్చని పేర్కొంది.
ఒప్పందానికి ముందే పరిశీలించాలి
హలాల్ సర్టిఫికేషన్ సంస్థతో ఒప్పందం చేసుకునే ముందు, ఆ సంస్థకు FSQC గుర్తింపు ఉందో లేదో తనిఖీ చేయాల్సిన బాధ్యత దిగుమతిదారులదేనని కేంద్రం స్పష్టం చేసింది. గుర్తింపు లేని సంస్థలతో చేసుకున్న ఒప్పందాలు లేదా లావాదేవీల వల్ల తలెత్తే ఆర్థిక లేదా కాంట్రాక్టు నష్టాలకు FSQC బాధ్యత వహించదని హెచ్చరించింది. అందువల్ల ఒమన్‌కు ఆహార ఉత్పత్తులను ఎగుమతి చేసే కంపెనీలు, దిగుమతిదారులు 2027 జూలై 1కి ముందే తమ హలాల్ సర్టిఫికేషన్ వ్యవస్థను పరిశీలించుకోవాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఫేక్ లాటరీ స్కామ్.. Dh84,000 కోల్పోయిన వ్యక్తి..!!
- యానిమల్స్ పై క్రూరత్వానికి BD100,000 వరకు ఫైన్.. ఐదేళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో హలాల్ సర్టిఫికెట్లపై కీలక నిబంధనలు..!!
- ఓపెన్ఏఐ ఏఐ ఏజెంట్ల నిర్వాకం.. ఆన్లైన్లో యూజర్ల ఫోటోలు..!!
- సౌదీలో వాణిజ్య మంత్రిత్వ శాఖ విస్తృత తనిఖీలు..!!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు ముమ్మరం..!!
- ఉద్యోగ మోసం ఆరోపణలు: కేరళలో సంస్థ యజమాని అదుపులోకి తీసుకున్నా.. సాధారణంగానే కార్యకలాపాలు
- న్యూయార్క్‌లో భారత్–జీసీసీ ట్రోయికా మంత్రుల సమావేశం
- హైదరాబాద్‌లో రాపిడో ఫుడ్ డెలివరీ.. ‘ఓన్లీ’ యాప్ ప్రారంభం
- కాంగోలో కుప్పకూలిన విమానం..14 మంది మృతి







