'రోమియో జూలియట్' స్టొరీ గ్లింప్స్- అక్టోబర్ 23న థియేటర్లలో రిలీజ్
- September 28, 2026
హర్షిత్, విశాఖ ధిమాన్ జంటగా నటిస్తున్న యూత్‌ఫుల్ జెన్‌జెడ్ లవ్ డ్రామా ‘రోమియో జూలియట్’. భార్గవ్ మాచర్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వైవా హర్ష, సిరి హనుమంత్, ప్రసాద్ బెహరా, ప్రభాస్ శ్రీను, అజయ్ ఘోష్, అజయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నవ రస ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సందీప్ ఎన్, వెంకటేశ్వరరావు చల్లగుల్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గడ్డం రాకేష్ రెడ్డి, రుద్రదేవ్ మాడిరెడ్డి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
సాధారణంగా తెలుగు సినిమాలు ఫస్ట్ షో పడే వరకు కథను, కథలోని కీలక అంశాలను సీక్రెట్‌గా ఉంచుతాయి. అయితే ‘రోమియో జూలియట్’ మేకర్స్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. సినిమా థియేట్రికల్ రిలీజ్‌కు దాదాపు నాలుగు వారాల ముందే.. ఈరోజు చిత్రంలోని స్టోరీ రివీల్ వీడియోను విడుదల చేశారు. అక్టోబర్ 23, 2026న థియేటర్లలోకి రానున్న ఈ సినిమా కథలోని కోర్ పాయింట్‌ను ముందుగానే ప్రేక్షకులకు పరిచయం చేయడం టాలీవుడ్‌లో అరుదైన ప్రయత్నంగా చెప్పొచ్చు. తమ కంటెంట్, డిఫరెంట్ నెరేటివ్‌పై టీమ్‌కు ఉన్న నమ్మకాన్ని ఈ నిర్ణయం ప్రతిబింబిస్తోంది.
మరో ప్రత్యేకత ఏమిటంటే.. వరల్డ్ రెబల్స్ డే సందర్భంగా, రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజునే ‘రోమియో జూలియట్’ థియేటర్లలోకి రానుంది. ప్రభాస్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈ స్టోరీ రివీల్ గ్లింప్స్‌ను విడుదల చేసి.. చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలిపారు.
గ్లింప్స్ విషయానికి వస్తే.. ఇందులో హీరో ఒక లోకల్ గన్ డీలర్‌ను కలసి ఓ ఆయుధాన్ని కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తాడు. ఓ అమ్మాయిని చంపాలనే ఉద్దేశంతో ఆ ఆయుధాన్ని కొనుగోలు చేయాలని చూస్తాడు. అక్కడి నుంచి కథ మోడరన్ రిలేషన్స్ చుట్టూ తిరిగే కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది.
వన్ నైట్ స్టాండ్, హుక్‌అప్, ఫ్లింగ్, బెంచింగ్, సిట్యుయేషన్‌షిప్, బాయ్ బెస్టీ వంటి నేటి రిలేషన్‌షిప్ టెర్మ్స్‌ను హీరో వివరించే విధానం ఆసక్తికరంగా ఉంది. దీంతో ‘రోమియో జూలియట్’ ఒక సాధారణ లవ్ స్టోరీ కాదనే విషయం స్పష్టమవుతోంది.
ప్రస్తుత జెన్‌జెడ్ తరం ప్రేమను, రిలేషన్‌షిప్స్‌ను, గొడవలు, బ్రేకప్స్‌ను ఎలా చూస్తోంది? సిట్యుయేషన్‌షిప్స్, సోషల్ మీడియా, పబ్లిక్ బ్రేకప్స్, మారుతున్న రిలేషన్‌షిప్ అంశాలు కథలో కీలకంగా ఉండనున్నాయి. ముఖ్యంగా 18 నుంచి 25 ఏళ్ల వయసున్న యువతను టార్గెట్ చేస్తూ.. వాళ్లకు తెలిసిన భాష, రిలేషన్‌షిప్ డైనమిక్స్‌తో కథను తెరకెక్కించినట్లు గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది.
బోల్డ్ ప్రిమైజ్, కాంటెంపరరీ ట్రీట్‌మెంట్‌తో విడుదలైన ఈ స్టోరీ రివీల్ గ్లింప్స్ ఇప్పటికే ఆన్‌లైన్‌లో ఆసక్తిని పెంచుతోంది. జెన్‌జెడ్ రిలేషన్‌షిప్స్‌ను డిఫరెంట్ యాంగిల్‌లో చూపించే ప్రయత్నంగా ‘రోమియో జూలియట్’ ఆసక్తిని రేకెత్తిస్తోంది.
‘రోమియో జూలియట్’కు భార్గవ్ మాచర్ల, ప్రశాంత్ రాఘతి కథ అందించారు. గోపి సుందర్ సంగీతం సమకూరుస్తున్నారు. అభిరాజ్ నాయర్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, యువ కిరణ్ ఎడిటింగ్. కార్తా ప్రొడక్షన్స్ ధీరజ్ పొనుగోటి, ప్రకీర్తి ఉప్పలపాటి ప్రొడక్షన్ డిజైన్.
తారాగణం: హర్షిత్, విశాఖ ధీమాన్, వైవా హర్ష, సిరి హనుమంత్, ప్రసాద్ బెహరా, ప్రభాస్ శీను, అజయ్ ఘోష్, అజయ్
సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం: భార్గవ్ మాచర్ల
రచయిత: భార్గవ్ మాచర్ల & ప్రశాంత్ రాగతి
సంగీతం: గోపీ సుందర్
సినిమాటోగ్రఫీ: అభిరాజ్ నాయర్
ఎడిటర్: యువ కిరణ్
ప్రొడక్షన్ డిజైన్: కర్తా ప్రొడక్షన్స్, ధీరజ్ పొనుగోటి, ప్రకీర్తి ఉప్పలపాటి
నిర్మాతలు: సందీప్ ఎన్, వెంకటేశ్వరరావు చల్లగుళ్ల
సహ నిర్మాతలు: గడ్డం రాకేష్ రెడ్డి, రుద్రదేవ్ మాదిరెడ్డి
బ్యానర్: నవరస ఎంటర్‌టైన్‌మెంట్స్
Marketing Strategy: Tamada మీడియా
డిజిటల్ మార్కెటింగ్: Warey Media
PRO వంశీ-శేఖర్
తాజా వార్తలు
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..
- హార్ముజ్ జలసంధిలో అమెరికా అండర్‌వాటర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న ఇరాన్
- ఆన్లైన్ షాపింగ్‌కు కొత్త రూల్స్..జనవరి 1 నుంచి అమలు
- పర్యాటకాంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్‌లో భారత కార్మికుల కోసం లేబర్ క్యాంప్..ఆర్థిక, వైద్య అవగాహన పై దృష్టి
- మచిలీపట్నంలో రేపు ‘మీకోసం’ ప్రజా సమస్యల పరిష్కార వేదిక
- మిస్ యూనివర్స్ ఇండియా 2026 కజియా లిజ్ మెజోకు షేక్ నహ్యాన్ ఆశీస్సులు
- అక్టోబర్ 12 నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. షెడ్యూల్ విడుదల!
- పర్యాటక రంగంలో డిజిటల్ మార్పులకు బహ్రెయిన్ ప్రాధాన్యం..!!







