కువైట్‌లో ఆహార భద్రత తనిఖీలు..!!
- November 20, 2026
కువైట్ : కువైట్‌లో ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన ఆహార విక్రయ కేంద్రాలపై అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఫర్వానియా గవర్నరేట్ పరిధిలో చేపట్టిన ఈ తనిఖీల్లో మొత్తం 53 ఉల్లంఘనలను గుర్తించారు. దీంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 214 కిలోల ఆహార పదార్థాలను ధ్వంసం చేశారు.
పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఆధ్వర్యంలో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఇతర సంబంధిత ప్రభుత్వ విభాగాల సమన్వయంతో ఈ తనిఖీ కార్యక్రమం నిర్వహించారు. మొత్తం 45 ఆహార విక్రయ కేంద్రాలను అధికారులు తనిఖీ చేశారు.
ప్రజారోగ్య పరిరక్షణ, ఆహార భద్రతా ప్రమాణాల అమలును నిర్ధారించేందుకు తనిఖీలు నిరంతరం కొనసాగిస్తామని కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ స్పష్టం చేసింది. ఆహార విక్రయ సంస్థలు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించింది.
తాజా వార్తలు
- మస్కట్లో అల్ ఖువైర్ స్ట్రీట్ ఎగ్జిట్ రాత్రివేళ మూసివేత..!!
- మలేషియా వెళ్లే భారతీయులకు అలర్ట్.. 2027 నుంచి కొత్త రూల్స్
- ఖతార్లో పిల్లలను కారులో వదిలేస్తే QR10,000 జరిమానా..!!
- పాకిస్థాన్లో ఘోర విషాదం..రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి!
- సౌదీ సరిహద్దుల్లో ‘అబ్షర్ ట్రావెల్’ సేవలకు ఎలక్ట్రిక్ బైక్లు..!!
- సౌదీ అరేబియాలో 2027 నుంచి కొత్త టాక్స్ విధానం..!!
- కువైట్‌లో ఆహార భద్రత తనిఖీలు..!!
- యూఏఈలో ఫైర్ వర్క్స్, డ్రోన్ షోలు, సైనిక పరేడ్లతో సందడి..!!
- బంగాళాఖాతంలో భీకర తుపాను.. ఏపీ తీర ప్రాంతాలకు హై అలర్ట్..
- విదేశాల్లో చదివే విద్యార్థులకు గుడ్ న్యూస్!!







