బంగాళాఖాతంలో భీకర తుపాను.. ఏపీ తీర ప్రాంతాలకు హై అలర్ట్..
- November 19, 2026
అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలను వణికిస్తోంది. మొదట ఏపీ వైపు దూసుకొస్తుందని భావించిన ఈ తుపాను.. ఇప్పుడు ఒడిశా వైపు దిశ మార్చుకుంది. అయినప్పటికీ ఏపీకి ముప్పు తప్పలేదని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
గంటకు 100కి.మీ వేగంతో గాలులు:
రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వివరాల ప్రకారం.. తుఫాన్ గత 6 గంటల్లో గంటకు 13 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదిలింది. నరసాపురం, కళింగపట్నం, గోపాల్పూర్ ప్రాంతాలకు సమీపంలో కేంద్రీకృతమైంది.
రానున్న గంటల్లో గోపాల్పూర్ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అంచనా.. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు.
మరోవైపు తుఫాన్ ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ ప్రాంతాలపై ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా నవంబర్ 19, 20 తేదీల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
స్కూళ్లు, అంగన్వాడీలకు సెలవులు:
తుఫాన్ ముప్పును దృష్టిలో పెట్టుకుని అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ప్రభావిత ప్రాంతాల్లో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించారు. కొన్ని జిల్లాల్లో 3 రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చినట్లు సమాచారం.. అయితే, ఆయా ప్రాంతాల్లో సెలవుల వివరాలను స్థానిక అధికారుల ప్రకటనల ద్వారా నిర్ధారించుకోవాలి.
తాజా వార్తలు
- బంగాళాఖాతంలో భీకర తుపాను.. ఏపీ తీర ప్రాంతాలకు హై అలర్ట్..
- విదేశాల్లో చదివే విద్యార్థులకు గుడ్ న్యూస్!!
- రియాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో హౌతీ మిలిటెంట్ల దాడి..
- పేదరికం పై భారత్ విజయం: ప్రధాని మోదీ
- దుబాయ్‌లో ఇక్షాన గోల్డ్ అండ్ డైమండ్స్‌లో అదిరిపోయే ఆఫర్లు..
- హైదరాబాద్‌లో ‘నషా ముక్త్ భారత్ యాత్ర’..
- యూఏఈ సముద్ర తీరాల్లో అద్భుత దృశ్యం..!!
- కువైట్‌లో ట్రాఫిక్ సమస్యకు చెక్..!!
- ఒమన్ లో 344 మంది ఖైదీలకు సుల్తాన్ క్షమాభిక్ష..!!
- బహ్రెయిన్‌లో నవంబర్ 24 నుంచి సిటీ స్కేప్ 2026..!!







