సెలబ్రిటీ టాక్ షోకు మెగా స్టార్ సిద్ధం?
- September 28, 2026
దర్శకుడు బాబీ కొల్లి నేతృత్వంలో తెరకెక్కుతున్న ‘కాకా’ సినిమా షూటింగ్‌తో ఎంతో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి తదుపరి ప్రాజెక్ట్‌పై సినీ వర్గాల్లో తీవ్రంగా చర్చ సాగుతోంది. ప్రముఖ గ్లోబల్ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ నిర్మించబోయే ఒక ప్రతిష్టాత్మక సెలబ్రిటీ టాక్ షో లేదా పాడ్‌కాస్ట్ ద్వారా చిరంజీవి డిజిటల్ దునియాలోకి అడుగుపెట్టనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మొదట ఆయన జీవితంపై డాక్యుమెంటరీ ప్లాన్ చేసినప్పటికీ, అభిమానులతో నేరుగా ముచ్చటించేలా ఉండే సరికొత్త టాక్ షో కాన్సెప్ట్‌కే చిరు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఈ భారీ షోకి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే నెట్‌ఫ్లిక్స్ నుంచి వెలువడే అవకాశముంది.
భారీ రెమ్యూనరేషన్–పాత జ్ఞాపకాల పునరావృతం
ప్రస్తుతం ఒక్కో సినిమాకు సుమారు రూ. 70 నుంచి రూ.75 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్న మెగాస్టార్, ఈ నెట్‌ఫ్లిక్స్ టాక్ షో కోసం అంతకు మించి భారీ స్థాయిలో పారితోషికం అందుకోనున్నారని టాక్ నడుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ను ఆయన కుమార్తె సుస్మిత కొణిదెల తన గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నట్లు సమాచారం. గతంలో బుల్లితెరపై ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోకి హోస్ట్‌గా వ్యవహరించి బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న చిరంజీవి, ఇప్పుడు ఓటీటీ వేదికపై గ్లోబల్ ఆడియన్స్‌ను ఏ విధంగా అలరించబోతున్నారోనని మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజా వార్తలు
- తాను చదువుకున్న పాఠశాలకు మిస్ యూనివర్స్ కాజియా పునరాగమనం
- అక్టోబర్ 1 నుంచి యూఏఈ పుస్తక దుకాణాల్లో షేక్ మహమ్మద్ బిన్ రషీద్ ‘ది లెటర్స్’
- NATS ఆధ్వర్యంలో దిగ్విజయంగా ‘అడాప్ట్ ఎ పార్క్' కార్యక్రమం
- ఎతిహాద్ రైల్ దుబాయ్ స్టేషన్ ప్రారంభం..సెప్టెంబర్ 30 నుంచి ప్రయాణికుల సేవలు
- భారత్–షార్జా వాణిజ్య, పెట్టుబడుల సహకారంపై చర్చలు
- విశాఖ మెట్రోకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- రూ.20కే రెండు లక్షల ప్రమాద బీమా
- భారత్–యూఏఈ పెట్టుబడుల భాగస్వామ్యంపై కీలక చర్చలు
- తెలంగాణా రాష్ట్రంలో తెలుగుభాషా దినోత్సవం
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ఇద్దరి అరెస్ట్..!!







