దీపావళి టపాసుల పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

- September 30, 2026 , by Maagulf
దీపావళి టపాసుల పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

న్యూ ఢిల్లీ: దీపావళి పండుగ సందర్భంగా టపాసులపై పూర్తిస్థాయి నిషేధం విధించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పర్యావరణ కాలుష్యం అలాగే ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కొన్ని కీలకమైన ఆంక్షలు మాత్రం వర్తిస్తాయని కోర్టు తెలిపింది. రోజంతా టపాసులు కాల్చేందుకు ఎలాంటి అనుమతి లేదని కేవలం నిర్దిష్ట సమయంలో మాత్రమే బాణసంచా కాల్చేందుకు అవకాశం కల్పిస్తామని స్పష్టం చేసింది.

పిల్లలు వృద్ధుల ఆరోగ్యం కోసం నియంత్రణలు
చిన్నారులు అలాగే వృద్ధులు మరియు అనారోగ్యంతో బాధపడే వారి సంక్షేమం అత్యంత ముఖ్యం అని కోర్టు పేర్కొంది. కాలుష్య స్థాయిలను అణచివేయడానికి ప్రభుత్వాలు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. పండుగ ఆనందంతో పాటు అందరి ఆరోగ్యం కాపాడుకోవడం మన బాధ్యత అని న్యాయస్థానం గుర్తుచేసింది.

పండుగ పూట కచ్చితంగా పాటించాల్సరి రూల్స్
అనుమతి పొందిన గ్రీన్ క్రాకర్స్ మాత్రమే నిర్దేశిత సమయాల్లో కాల్చాలని అధికారులు సూచిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలందరూ సురక్షితంగా మరియు ఆనందంగా పండుగను జరుపుకోవాలని కోర్టు ఆకాంక్షించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com