హైదరాబాద్ విమానాశ్రయంలో DRI భారీ ఆపరేషన్
- September 30, 2026
దోహా నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద 4.9 కిలోల కొకైన్ స్వాధీనం.. విలువ రూ.24.5 కోట్లు
హైదరాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు భారీగా కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దోహా నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద నుంచి 4.9 కిలోల కొకైన్ను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
డీఆర్ఐ అధికారులకు అందిన విశ్వసనీయ సమాచారంతో ప్రయాణికుడిపై నిఘా పెట్టారు. విమానాశ్రయంలో తనిఖీలు నిర్వహించగా అతని వద్ద కొకైన్ ఉన్నట్లు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాల అంతర్జాతీయ అక్రమ మార్కెట్ విలువ సుమారు రూ.24.5 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
కొకైన్‌ను స్వాధీనం చేసుకున్న అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.ఈ మాదకద్రవ్యాల అక్రమ రవాణా వెనుక ఉన్న నెట్‌వర్క్, ఇతర వ్యక్తుల ప్రమేయంపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
అంతర్జాతీయ మార్గాల ద్వారా మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు డీఆర్ఐ అధికారులు నిఘాను మరింత కట్టుదిట్టం చేస్తున్నారు.
తాజా వార్తలు
- Abdullah bin Salem opens 58th Watch and Jewellery Middle East Show
- దుబాయ్‌లో తొలి ఎతిహాద్ రైల్ స్టేషన్ ప్రారంభం
- హైదరాబాద్ విమానాశ్రయంలో DRI భారీ ఆపరేషన్
- అక్టోబర్ 2 నుంచి ‘సేవ్ డెమొక్రసీ మార్చ్’.. ఇండియా కూటమి కీలక నిర్ణయం
- నమో భారత్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్..
- దీపావళి టపాసుల పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
- కువైట్‌లో జంతువులను బహిరంగ ప్రదేశాల్లో వదిలేస్తే చర్యలు..
- ఒమన్‌లో ఆ ఫ్యాక్టరీపై పర్యావరణ శాఖ చర్యలు..!!
- యూఏఈలో 30, 40 ఏళ్ల వయసులో ఉన్నవారికి గుండె జబ్బుల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో దాడులను ప్రోత్సహించే పోస్టులు.. 10 ఏళ్ల జైలుశిక్ష..!!







