ఒమన్‌లో వాహనాలతో స్టంట్లు చేస్తే OMR500 జరిమానా, జైలు శిక్ష..!!
- November 17, 2026
మస్కట్: ఒమన్‌లో వాహనాలతో స్టంట్లు చేయడం, రోడ్లపై డ్రిఫ్టింగ్, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంపై అధికారులు హెచ్చరించారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే గరిష్ఠంగా మూడు నెలల జైలు శిక్షతో పాటు OMR500 వరకు జరిమానా విధించే అవకాశం ఉందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించింది. జాతీయ దినోత్సవ వేడుకల నేపథ్యంలో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చేపట్టిన ప్రచారంలో భాగంగా పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఈ హెచ్చరికలు జారీ చేసింది. పౌరులు, ప్రవాసులు వేడుకలను బాధ్యతాయుతంగా జరుపుకోవాలని, తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టవద్దని సూచించింది.
ట్రాఫిక్ చట్టంలోని ఆర్టికల్ 49(5) ప్రకారం.. పబ్లిక్ రోడ్లపై లేదా వాహన స్టంట్లకు అనుమతి లేని ప్రాంతాల్లో స్టంట్లు చేయడం నేరం. ఈ నేరానికి గరిష్ఠంగా మూడు నెలల జైలు శిక్ష, OMR500 వరకు జరిమానా లేదా ఈ రెండింటిలో ఏదో ఒక శిక్ష విధించవచ్చు. అలాగే అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, ప్రమాదకరంగా ఓవర్‌టేకింగ్ చేయడం వంటి చర్యలపైనా అధికారులు హెచ్చరించారు. ఇలాంటి ప్రవర్తన వల్ల ప్రాణనష్టం సంభవించడంతో పాటు ఆస్తులకు నష్టం కలిగే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
ట్రాఫిక్ చట్టంలోని ఆర్టికల్ 50 ప్రకారం.. అతివేగంగా లేదా ఇతరుల ప్రాణాలు, ఆస్తులకు ప్రమాదం కలిగించే విధంగా వాహనం నడపడం, నిషేధిత లేదా ప్రమాదకర ప్రాంతాల్లో ఓవర్టేక్ చేయడం, సరైన కారణం లేకుండా రోడ్డు షోల్డర్‌ను ఉపయోగించి ఓవర్టేక్ చేయడం నేరాలుగా పరిగణిస్తారు. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారికి గరిష్ఠంగా రెండు నెలల జైలు శిక్ష, OMR500 వరకు జరిమానా లేదా ఈ రెండు శిక్షలు విధించే అవకాశం ఉంది.
జాతీయ దినోత్సవ వేడుకల పేరుతో ప్రజా భద్రతను విస్మరించరాదని పబ్లిక్ ప్రాసిక్యూషన్ స్పష్టం చేసింది. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో భక్తిశ్రద్ధలతో ఛఠ్ పూజ..!!
- కేరళకు చెందిన భారతీయుడిని వరించిన అదృష్టం..!!
- ఒమన్‌లో వాహనాలతో స్టంట్లు చేస్తే OMR500 జరిమానా, జైలు శిక్ష..!!
- సౌదీలో సపోర్ట్ లేబర్ రంగంపై నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు..!!
- ఖతార్ అమీర్‌తో అబుదాబి డిప్యూటీ రూలర్ భేటీ..!!
- కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ ఫొటోలు వాడుతున్నారా?
- రాష్ట్ర పండుగగా రామోజీరావు జయంతి.. చంద్రబాబు కీలక ప్రకటన!
- హైదరాబాద్‌లో 27వ అఖిల భారత పోలీస్ బ్యాండ్ పోటీలు ప్రారంభం
- దుబాయ్ ఒపెరా టికెట్ల పేరుతో నకిలీ వెబ్సైట్లు..ప్రేక్షకులకు హెచ్చరిక
- విజయవాడలో రెండో రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2026..







