విజయవాడలో రెండో రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2026..

- November 16, 2026 , by Maagulf
విజయవాడలో రెండో రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2026..

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైన విజయవాడలో సోమవారం రెండో ‘రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్–2026’ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

వీరితో పాటు పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్ ద్వారా వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచి, సమాజానికి సేవలందించిన వ్యక్తులు, సంస్థలను గుర్తించి గౌరవిస్తున్నారు. రెండోసారి నిర్వహించిన ఈ అవార్డుల కార్యక్రమం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర, జాతీయ స్థాయి ప్రముఖులు హాజరుకావడంతో విజయవాడలో సందడి నెలకొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com