పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- October 01, 2026
ఫ్లైదుబాయ్ విమాన ప్రయాణ సమయంలో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిని ఎదుర్కొని, వందలాది మంది ప్రాణాలను కాపాడిన సాహస పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌ను గుజరాత్ ప్రభుత్వం అరుదైన గౌరవంతో సత్కరించింది. ఆయన ప్రదర్శించిన సాహసానికి గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం ‘విశిష్ట గుజరాత్ గరిమా అవార్డు’ను ప్రకటించింది. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రజలకు వెల్లడించారు.
కాక్‌పిట్‌లో ఊహించని ప్రమాదం
దుబాయ్ నుండి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ నగరానికి బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానంలో ఈ నాటకీయ ఘటన చోటుచేసుకుంది. విమానం గాల్లో ఉండగా, సహ పైలట్ ఉద్దేశపూర్వకంగా విమానాన్ని కూల్చివేయడానికి ప్రయత్నించాడు.ఇందులో భాగంగానే ఆకస్మికంగా కెప్టెన్ స్మిత్ మచ్చర్ పై క్రాష్ యాక్స్ (గొడ్డలి) వంటి ప్రమాదకర వస్తువుతో దాడికి పాల్పడ్డాడు.
ప్రాణాలను లెక్కచేయని అసాధారణ ధైర్యం
సహ పైలట్ అకస్మాత్తుగా జరిపిన ఈ దాడిలో కెప్టెన్ స్మిత్ తీవ్రంగా గాయపడ్డారు. అయినప్పటికీ ఆయన తన ప్రాణాలను పణంగా పెట్టకుండా, సంయమనం కోల్పోకుండా విమాన నియంత్రణను తన చేతుల్లోకి తీసుకున్నారు. తీవ్ర గాయాల నొప్పితోనే విమానాన్ని సురక్షితంగా మార్గదర్శకం చేసి, సౌదీ అరేబియాలోని తబూక్ ఎయిర్‌పోర్టులో అత్యవసర ల్యాండింగ్ (ఎమర్జెన్సీ ల్యాండింగ్) చేశారు. దీనివల్ల విమానంలో ఉన్న మొత్తం 174 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
సీఎం భూపేంద్ర పటేల్ ప్రశంసలు మరియు ప్రత్యేక పూజలు
ఈ సాహస ఘటనపై గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా తీవ్రంగా స్పందిస్తూ కెప్టెన్ స్మిత్‌ను ‘గుజరాతీ వీర పుత్రుడు’గా అభివర్ణించారు. ఆయన చూపిన తెగువ దేశానికే గర్వకారణమని కొనియాడారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కెప్టెన్ స్మిత్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుంటూ చారిత్రాత్మక సోమనాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు సీఎం తెలిపారు.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







