కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌కు గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా ప్రశంసలు

- October 01, 2026 , by Maagulf
కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌కు గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా ప్రశంసలు

హైదరాబాద్‌: దుబాయ్‌–టెల్‌ అవీవ్‌ ఫ్లై దుబాయ్‌ విమాన ఘటనపై రాష్ట్ర గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా స్పందించారు.విమాన కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌ చూపిన అసాధారణ ధైర్యసాహసాలను గవర్నర్ ప్రశంసించారు.

తీవ్రంగా గాయపడినప్పటికీ ప్రయాణికుల ప్రాణాలను కాపాడేందుకు కెప్టెన్‌ మచ్చర్‌ చూపిన ధైర్యం, సమయస్ఫూర్తి, కర్తవ్యనిబద్ధత అసమాన్యమైనదని  గవర్నర్‌  పేర్కొన్నారు. ఆయన అపారమైన సాహసం, అకుంఠిత స్ఫూర్తి వల్ల మరింత పెద్ద విషాదం తప్పిందని పేర్కొన్నారు.

“యూ ఆర్‌ ఏ ట్రూ హీరో. నిన్ను చూసి దేశం, ప్రపంచం గర్విస్తుంది” అని గవర్నర్‌ అన్నారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రయాణికుల రక్షణకు కెప్టెన్‌ మచ్చర్‌ చేసిన ప్రయత్నాలు అత్యంత ప్రశంసనీయమని పేర్కొన్నారు.విధి నిర్వహణలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా చూపిన ఆయన ధైర్యం, మానవత్వానికి గొప్ప ఉదాహరణగా నిలుస్తుందని గవర్నర్‌ అన్నారు.
తీవ్ర గాయాల నుంచి కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని గవర్నర్‌ ఆకాంక్షించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com