అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- October 01, 2026
దుబాయ్: అజ్మాన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎడమ కాలును కోల్పోయిన కేరళకు చెందిన భారతీయ ప్రవాస కార్మికుడికి దుబాయ్ కోర్టులో సుదీర్ఘ న్యాయ పోరాటం అనంతరం Dh650,000 పరిహారం లభించింది.
కేరళకు చెందిన 38 ఏళ్ల సుధీర్ గత 15 ఏళ్లుగా యూఏఈలో లిఫ్ట్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నారు. ఇద్దరు పిల్లల తండ్రి అయిన ఆయన.. 2025 మేలో అజ్మాన్‌లోని ఓ సంస్థలో సూపర్వైజర్గా పనిచేస్తున్న సమయంలో ఈ ప్రమాదానికి గురయ్యారు.
పని ప్రదేశానికి ఇతర కార్మికులతో కలిసి కంపెనీ వాహనంలో వెళ్తుండగా డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. వాహనం ఎత్తైన పాదచారుల వంతెనను ఢీకొని అనంతరం విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుధీర్ ఎడమ కాలు తీవ్రంగా దెబ్బతింది.
వెంటనే ఆయనను దుబాయ్‌లోని జెబెల్ అలీలో ఉన్న NMC రాయల్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు కాలును కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ, గాయం తీవ్రంగా ఉండటంతో మోకాలి కింది భాగం వరకు ఎడమ కాలును తొలగించాల్సి వచ్చింది.
దుబాయ్ కోర్టులో న్యాయ పోరాటం
ప్రమాదం అనంతరం సుధీర్ తరఫున అడ్వకేట్ షమ్సుద్దీన్ కరునాగప్పల్లి నేతృత్వంలో బీమా సంస్థపై దుబాయ్ కోర్టులో పరిహారం కోసం కేసు దాఖలు చేశారు. ప్రమాదానికి ముందు ఆరోగ్యంగా ఉన్న సుధీర్ శాశ్వత వైకల్యానికి గురికావడం, ఉద్యోగం చేసి ఆదాయం పొందే పరిస్థితి లేకపోవడం, శారీరకంగా మరియు మానసికంగా ఎదుర్కొన్న బాధలు, భార్య, ఇద్దరు పిల్లలపై పడే ఆర్థిక, భావోద్వేగ ప్రభావాలను పరిగణనలోకి తీసుకుని 10 లక్షల దిర్హామ్‌ల పరిహారం కోరారు.
తొలుత కేసును విచారించిన కోర్టు సుధీర్‌కు 4 లక్షల దిర్హామ్‌లు పరిహారంగా ఇవ్వాలని తీర్పునిచ్చింది. ఈ మొత్తంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆయన తరఫు న్యాయవాది ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేశారు. దీంతో పరిహారం మొత్తాన్ని Dh650,000కు పెంచారు.
తాజాగా పరిహారం, కోర్టు ఖర్చులు కలిపి మొత్తం Dh650,000 బీమా సంస్థ నుంచి సుధీర్ బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయి.
అయితే, ఈ పరిహారం కూడా తగినంత కాదని పేర్కొంటూ అదనపు పరిహారం కోసం దుబాయ్ కోర్ట్ ఆఫ్ కాసేషన్లో మరో అప్పీల్ దాఖలు చేసినట్లు అడ్వకేట్ షమ్సుద్దీన్ తెలిపారు.
ప్రమాదంలో సుధీర్ కుడి కాలు కూడా గాయపడిందని, ప్రమాదం జరిగినప్పటి నుంచి ఆయన నిరంతర వైద్య చికిత్స పొందుతున్నారని న్యాయవాది వెల్లడించారు. ప్రస్తుతం కూడా కుడి కాలుకు చికిత్స కొనసాగుతోందని తెలిపారు.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







