నెగటివ్ నుంచి డిజిటల్ ఫార్మెట్లోకి 'బాషా'
- August 23, 2016
తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సంచలన విజయం సాధించిన చిత్రం 'బాషా'. వసూళ్ల రికార్డులతో సునామీ సృష్టించిన రజనీకాంత్ 'బాషా' చిత్రాన్ని డిజిటల్ ఫార్మెట్ రూపంలో మరోమారు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాత టి.జి.త్యాగరాజన్ సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈచిత్రానికి సంబంధించి సంగీత దర్శకుడు దేవా ఆధ్వర్యంలో డిటిఎస్ జరుగుతోంది. నెగటివ్ నుంచి డిజిటల్ ఫార్మెట్లోకి మారుస్తున్నారు. అత్యాధునిక సౌండ్ సిస్టమ్ 5.1 సరౌండ్ సౌండ్‌తో డిజిటలైజేషన్ చేస్తున్నట్టు టి.జి.త్యాగరాజన్ తెలిపారు. 21 ఏండ్ల తర్వాత మళ్లీ 'బాషా' చిత్రం విడుదలవుతుండటంతో అభిమానులు, ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







