'మిస్టర్ కార్తీక్' చిత్రం ఆడియో విడుదల
- August 23, 2016
ధనుష్, రిచా గంగోపాధ్యాయ నాయకానాయికలుగా శ్రీరాఘవ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన 'మయక్కం ఎన్నా' చిత్రం ఇప్పుడు తెలుగులో 'మిస్టర్ కార్తీక్' పేరుతో అనువాదమవుతోంది. దీనికి జి.వి.ప్రకాష్ సంగీతాన్ని అందించారు. ఓం శివగంగ ఎంటర్ప్రైజెస్ పతాకంపై కె.బాబూరావు, కె.మల్లికార్జున్లు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న ఈ చిత్రం ఆడియో వేడుక హైదరాబాద్లో జరిగింది. అతిథిగా విచ్చేసిన నిర్మాత సి.కల్యాణ్ ఆడియో సీడీలను ఆవిష్కరించి, మరో అతిథిగా పాల్గొన్న నిర్మాత ఆర్.కె.గౌడ్కు అందించారు. థియేట్రికల్ ట్రైలర్ను వి.సముద్ర, రాజ్ కందుకూరిలు ఆవిష్కరించారు. శివరంజని మ్యూజిక్ ద్వారా ఈ ఆడియో విడుదలైంది.ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ, "తమిళంలో ప్రేక్షకుల ఆదరణను చూరగొన్న చిత్రమిది. ప్రేమ, వినోదాత్మక కుటుంబ అంశాలతో రూపొందిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంటుందన్న నమ్మకం ఉంది. సి.కల్యాణ్ ప్రోత్సాహంతోనే మేము నిర్మాతలుగా మారి ఈ చిత్రాన్ని అందిస్తున్నాం. ధనుష్ అభినయం, దర్శకుడు శ్రీరాఘవ ప్రతిభను గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు" అని అన్నారు.ఇంకా ఈ కార్యక్రమంలో దర్శకులు నగేష్ నారదాసి, భూషణ్, మాటల రచయిత వెంకట్ మల్లూరి తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- రియాద్లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







