‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ఫన్ ఫుల్ ట్రైలర్ రిలీజ్

- October 04, 2026 , by Maagulf
‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ఫన్ ఫుల్ ట్రైలర్ రిలీజ్

హర్ష చెముడు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. బాబు డెగాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని చవాన్, శ్రీధర్ చెని, దీపక్ ముస్త్యాల నిర్మించారు. రాజ్ సుహాస్, ప్రమదేశ్వి వి క్రియేటివ్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరించారు.

అక్టోబర్ 9 నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ETV Winలో ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ స్ట్రీమింగ్ కానుంది.

తాజాగా మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు. తన కొడుకుని ప్రేమించని హర్ష తండ్రి అమ్మాయిలని రిక్వెస్ట్ చేసే సన్నివేశంతో మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. హర్ష ఫన్ టైమింగ్ అలరించింది. హైపర్ క్యారెక్టర్ మరో హైలైట్‌గా నిలిచింది. 

జీవన్ కుమార్, ఐశ్వర్య హోలక్కల్, శ్రావ్య చౌదరి ఇతర కీలక పాత్రల్లో ఆకట్టుకున్నారు.

అజయ్ అరసాడ సంగీతం ఎంటర్టైమెంట్ ని మరింత ఎలివేట్ చేసింది. చిత్రానికి శక్తి అరవింద్ సినిమాటోగ్రఫీ అందించారు. జానీ షేక్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, లిఖిత్ లీ ఎడిటర్‌గా, సాయి ప్రావలిక కాస్ట్యూమ్ డిజైనర్‌గా, పీవీజీ విశ్వనాథ్ లైన్ ప్రొడ్యూసర్‌గా పనిచేశారు.

తారాగణం: హర్ష చెముడు, హైపర్ ఆది, జీవన్ కుమార్, ఐశ్వర్య హోలక్కల్, రూప శ్రావ్య, శ్రీ విద్యా, ప్రేమ్ సాగర్, వాసు ఇంటూరి, మహేందర్, జబర్దస్త్ గోపి

సిబ్బంది:
రచన & దర్శకత్వం: బాబు డేగల
నిర్మాతలు: చవాన్, శ్రీధర్ చెని & దీపక్ ముస్త్యాల
క్రియేటివ్ ప్రొడ్యూసర్స్ : రాజ్ సుహాస్ & ప్రమదేష్ వి
DOP: శక్తి అరవింద్
సంగీతం & బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: అజయ్ అర్సాడ
లైన్ ప్రొడ్యూసర్: పివిజి విశ్వనాథ్
ఎడిటర్: లికిత్ లీ
ప్రొడక్షన్ డిజైనర్: జానీ షేక్
కాస్ట్యూమ్ డిజైనర్: కొండగళ్ల సాయి ప్రవల్లిక
కొరియోగ్రాఫర్: ఈశ్వర్ పెంటి
ప్రోమోలు, టీజర్ & ట్రైలర్: ఉదయ్
పబ్లిసిటీ డిజైన్‌లు: ఆదర్శ చుక్కలు
కో-డైరెక్టర్: ప్రసాద్
పీఆర్వో: వంశీ శేఖర్

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com