ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- October 04, 2026
దోహా: రోగుల అనుభవాన్ని మెరుగుపరచడం, వైద్య సేవల నాణ్యతను పెంచడంలో కస్టమర్ సర్వీస్ ప్రాధాన్యతను చాటిచెప్పేందుకు ప్రైమరీ హెల్త్ కేర్ కార్పొరేషన్ (PHCC) కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తోంది. ఈ ఏడాది కార్యక్రమానికి “ గో ది ఎక్స్ ట్రా మైల్ (Go the Extra Mile)” అనే అధికారిక థీమ్‌ను ఎంపిక చేశారు. రోగుల అంచనాలను మించి సేవలు అందించడం, వారి అవసరాలను శ్రద్ధగా వినడం, అభిప్రాయాలు, ప్రశ్నలు, ఫిర్యాదులను సేవల నిరంతర మెరుగుదలకు ఉపయోగించుకోవడమే ఈ థీమ్ ప్రధాన ఉద్దేశమని PHCC తెలిపింది. పేషంట్ల పట్ల శ్రద్ధ అనేది కేవలం వైద్య సేవలు అందించడంతో ముగియదని, ఆత్మీయ స్వాగతం, సమయానుకూల స్పందన, స్పష్టమైన సమాచారం, అభిప్రాయాలను వినడం, రోగుల సేవా అనుభవాన్ని సులభతరం చేయడం కూడా అందులో భాగమేనని సంస్థ పేర్కొంది.
తొలి ఆరు నెలల్లో 3,163 ఫిర్యాదులు
2026 తొలి ఆరు నెలల్లో వివిధ కమ్యూనికేషన్ మార్గాల ద్వారా PHCCకి 3,163 ఫిర్యాదులు అందాయి. వీటిలో 94 శాతం ఫిర్యాదులను 25 పని దినాల్లోపు పరిష్కరించగా, 4 శాతం ఫిర్యాదులు 25 పని దినాల తర్వాత పరిష్కరించబడ్డాయి. మరో 2 శాతం ఫిర్యాదులు ఇంకా పరిష్కారం కావాల్సి ఉంది. ఫిర్యాదులను నిర్ణీత గడువులో పరిష్కరించేందుకు సంస్థ చేపడుతున్న చర్యలకు ఈ గణాంకాలు నిదర్శనమని PHCC తెలిపింది. ఫిర్యాదుల స్వీకరణ, వాటిపై స్పందన, ఫీడ్‌బ్యాక్ నిర్వహణ వ్యవస్థలను మరింత బలోపేతం చేస్తున్నట్లు పేర్కొంది. అదే సమయంలో తొలి ఆరు నెలల్లో 66 మంది పేషంట్లు కృతజ్ఞతలు, ప్రశంసలు వ్యక్తం చేసినట్లు తెలిపింది. వైద్య సిబ్బంది, ఇతర ఉద్యోగులు అందిస్తున్న సేవలకు ఈ ప్రశంసలు గుర్తింపుగా నిలుస్తున్నాయని, సానుకూల అనుభవాలను గుర్తించి వాటిని ఇతర బృందాల్లోనూ ప్రోత్సహించేందుకు ఈ ఫీడ్‌బ్యాక్ ఉపయోగపడుతుందని సంస్థ పేర్కొంది.
తాజా వార్తలు
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!
- ఒమన్‌లో పర్యాటక కార్యకలాపాల లైసెన్సింగ్‌కు కీలక నిబంధనలు..!!
- యూఏఈ లాటరీ.. ఓ విజేతకు Dh5 మిలియన్ భారీ బహుమతి..!!
- హవల్లీ అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం..!!
- బిగ్ టికెట్ అబుదాబి.. అజ్మాన్ ఫిలిప్పీన్స్ ప్రవాసికి Dh20 మిలియన్ జాక్‌పాట్..!!
- బహ్రెయిన్ విమానాశ్రయం వెనుక మాంగ్రూవ్ బెల్ట్..!!
- కువైట్ విమానాశ్రయంలో ట్రాన్సిట్ కార్యకలాపాలు నిలిపివేత యధాతథం..!!
- సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు కేరళ నర్సులు సహా ఐదుగురు మృతి
- కాక్‌పిట్ పై దాడి.. ‘చివరి పోరాటం’తో వందల ప్రాణాలు కాపాడిన ఫ్లై దుబాయ్ పైలట్







