ఆర్‌టిఎ బస్సులన్నీ యాక్సిడెంట్ ప్రూఫ్!
- August 24, 2016
దుబాయ్‌లోని అన్ని పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ బస్సులూ యాంటీ క్రాష్ టెక్నాలజీని సంతరించుకోనున్నాయి. వాహన ప్రమాదాల్ని 50 శాతం తగ్గించేలా ట్రయల్ ఫేజ్‌ని లక్ష్యంగా పెట్టుకుంది రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (ఆర్‌టిఎ). జూన్‌లో జరిగిన మిడిల్ ఈస్ట్ స్మార్ట్ గవర్నమెంట్ అండ్ స్మార్ట్ సిటీస్ ఎక్స్‌లెన్స్ అవార్డ్‌ని గెలుచుకున్న ఆర్‌టిఎ అభివృద్ధి చేసిన టెక్నాలజీని ఇందుకోసం వినియోగించనున్నారు. ఆర్‌టిఎ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఏజెన్సీ (పిటిఎ) సిఇఓ అబ్దుల్లా యూసుఫ్ అలీ మాట్లాడుతూ, ప్రస్తుత దశలో కొన్ని బస్సులకే ఈ టెక్నాలజీని వాడుతున్నామనీ, ఇంటర్‌సిటీ, అర్బన్ బస్సుల్లో ముందుగా ఈ టెక్నాలజీని ఉపయోగించి, ఫలితాలను విశ్లేషించి ఆ తర్వాత అన్ని బస్సుల్లోనూ వినియోగిస్తామన్నారు. మల్టిపుల్ సెన్సార్స్, అడ్వాన్స్‌డ్ కెమెరాలతో ఈ టెక్నాలజీ అనుసంధానమై ఉంటుంది. ఆపరేషన్ కంట్రోల్ సెంటర్ (ఓసిసి) వీటిని మానిటర్ చేస్తుంది. ప్రమాదాల్ని ముందుగా ఊహించి డ్రైవర్‌ని అప్రమత్తం చేయడం ఈ టెక్నాలజీ ప్రత్యేకత. అలాగే, బస్సుని నడిపే డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతోపాటు ఈ టెక్నాలజీపైనా అవగాహన కల్పిస్తారు.
తాజా వార్తలు
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్‌లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్‌లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్‌లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!
- ఇరాన్ పై అతి పెద్ద బాంబు దాడికి అమెరికా ప్లాన్
- షార్జా పోలీసుల భారీ ఆపరేషన్.. సైబర్ నేరాలకు పాల్పడిన నాలుగు ముఠాల గుట్టురట్టు!
- ‘సౌదీ పై దాడులు వెంటనే ఆపాలి’ అంటూ హౌతీలకు భారత్ తీవ్ర హెచ్చరిక







