అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు

- October 09, 2026 , by Maagulf
అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు

అమెరికా: ప్రముఖ అంతర్జాతీయ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను ప్రారంభించింది. ఈ విడతలో ప్రధానంగా కంపెనీకి అత్యంత కీలకమైన రీటైల్ బిజినెస్ పరిధిలోని వివిధ విభాగాలు ప్రభావితమయ్యాయి. విశ్వసనీయ వర్గాలు అంతర్జాతీయ నివేదికల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా సుమారు 1,000 మందికి పైగా వైట్-కాలర్ ఉద్యోగు ఉద్యోగాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.

ఈ ఉద్యోగాల కోత ప్రభావం భారత్, అమెరికా మరియు బ్రిటన్ దేశాల్లో పనిచేస్తున్న ఉద్యోగులపై నేరుగా పడింది. ముఖ్యంగా భారత్‌లో కంపెనీకి అత్యంత కీలకమైన ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ పండగ సేల్ నడుస్తున్న సమయంలోనే ఈ ఊచకోత వార్తలు రావడం గమనార్హం. తొలగింపునకు గురైన ఉద్యోగులు సంస్థ అంతర్గత కమ్యూనికేషన్ ప్లాట్‌ఫారమ్ ‘స్లాక్’ ద్వారా తమ ఆవేదనను వ్యక్తం చేశారు.

ఏయే విభాగాల పై ఈ లేఆఫ్‌ల ప్రభావం పడింది?

కేవలం ఒక్క ఆపరేషనల్ కేటగిరీకే పరిమితం కాకుండా, కస్టమర్ కేర్, సెల్లింగ్ పార్ట్‌నర్ సర్వీసెస్, మార్కెట్‌ప్లేస్ సపోర్ట్ టీమ్‌లు మరియు రీటైల్ ఈ-కామర్స్ విభాగానికి సంబంధించిన ఇంజనీరింగ్ బృందాల్లోని పోస్టులను కంపెనీ తొలగించింది.

ఉద్యోగాల తొలగింపునకు గల ముఖ్య కారణాలు

2025 చివరి నుండి 2026 ప్రారంభం వరకు అమెజాన్ ఇప్పటికే దాదాపు 30,000 కార్పొరేట్ ఉద్యోగాలను తొలగించింది. ఆ భారీ పునర్నిర్మాణ చర్యలకు కొనసాగింపుగానే, మేనేజ్‌మెంట్ లేయ‌ర్స్‌ తగ్గిస్తూ, సంస్థాగత వ్యయాన్ని నియంత్రించేందుకు ఈ లేఆఫ్‌లు చేపట్టినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అగ్రగామిగా ఎదిగేందుకు అమెజాన్ ఏఐ డేటా సెంటర్లు, ప్రత్యేక చిప్‌లు , సాంకేతిక మౌలిక వసతులకై దాదాపు 220 బిలియన్ డాలర్ల (సుమారు ₹22,000 కోట్లు) భారీ పెట్టుబడులకు ప్రణాళికలు రూపొందిస్తోంది. సంప్రదాయ రీటైల్ విభాగాల వ్యయాలను కుదించి, నిధులను ఏఐ వైపు మళ్లించే క్రమంలోనే ఈ నిర్ణయాలు తీసుకుంటోంది.

భారత మార్కెట్‌ పై ప్రభావం ఎంత?

భారతీయ ఉద్యోగుల పై ఈ కోత పడినప్పటికీ, అమెజాన్ భారత మార్కెట్ విస్తరణ నెమ్మదించలేదని తెలుస్తోంది. మార్చిలో బెంగళూరులో ప్రారంభించిన 11 లక్షల చదరపు అడుగుల ఆసియాలోనే అతిపెద్ద క్యాంపస్ (7,000 మంది సిబ్బంది సామర్థ్యం) దీనికి నిదర్శనం.ఆసియా సంస్కృతి

కాబట్టి, ఈ ప్రక్రియ దేశం నుంచి వెనక్కి తగ్గడం కాదని, సమర్థవంతమైన సాంకేతిక విభాగాలు మరియు ఐటీ వనరుల ఆధారంగా రీ-ఆర్గనైజ్ చేసుకునేందుకే అమెజాన్ ఈ చర్యలు చేపట్టిందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com