ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- October 09, 2026
అమరావతి: దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh)రాష్ట్రంలోని భక్తులకు, ఉత్సవ కమిటీలకు భారీ ఉపశమనం కలిగించే నిర్ణయాన్ని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా అనుమతులు పొందిన అన్ని దుర్గాదేవి మండపాలకు ఉచిత విద్యుత్‌ను అందించనున్నట్లు ఆయన ‘ఎక్స్’ (X) వేదికగా స్పష్టం చేశారు. పండుగను ప్రజలంతా అత్యంత భక్తిశ్రద్ధలు, సంతోషాల మధ్య జరుపుకోవాలనే ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన పేర్కొన్నారు.
ఉచిత విద్యుత్ నిబంధనలు.. గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు వేర్వేరు పరిమితులు:
ఈ పథకం పరిమితులకు లోబడి అమలవుతుందని, గ్రామీణ ప్రాంతాల్లోని మండపాలకు 3 కిలోవాట్లు (3 KW), పట్టణ ప్రాంతాల్లోని మండపాలకు 5 కిలోవాట్ల (5 KW) వరకు ఉచిత విద్యుత్ సౌకర్యం వర్తిస్తుందని వివరించారు. ఈ నిర్ణయంతో ఉత్సవ కమిటీలపై విద్యుత్ భారం తగ్గి పండుగ కళ సంతరించుకోనుంది. ప్రజలపై అమ్మవారి దివ్య ఆశీస్సులు నిరంతరం ఉండాలని, ఈ నవరాత్రులు అందరి జీవితాల్లో మంగళకరంగా సాగాలని మంత్రి లోకేష్ ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







