విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- October 09, 2026
విజయవాడ: విజయవాడ ఎన్టీఆర్ సర్కిల్ సమీపంలోని మారిస్ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో గాంధీ శిల్ప బజార్‌ను ( ప్రత్యేక ప్రదర్శన, అమ్మకం) శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ వైస్‌చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ విశ్వ మనోహరన్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పీ.సిసోడియా ముఖ్య అతిథిగా హాజరు కానుండగా, సంస్థ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ప్రదర్శనను ప్రారంభించనున్నారు.
కేంద్ర హస్తకళల అభివృద్ధి కమిషనర్, కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ సహకారంతో అక్టోబర్ 18 వరకు ఈ ప్రదర్శన నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన సుమారు 70 మంది కళాకారులు, చేతివృత్తిదారులు ఇందులో పాల్గొంటారు. కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మలు, కలంకారీ, చెక్క శిల్పాలు, టెర్రకోట, తోలుబొమ్మలు, క్రోషే లేస్ తదితర సంప్రదాయ హస్తకళా ఉత్పత్తులను ప్రత్యేకంగా ప్రదర్శించి విక్రయించనున్నారు.
ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రదర్శన అందుబాటులో ఉంటుందని విశ్వ మనోహరన్ తెలిపారు. నగర ప్రజలు పెద్ద సంఖ్యలో శిల్పి బజార్ ను సందర్శించి కళాకారులను ప్రోత్సహించాలని ఆయన కోరారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!







