శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- October 09, 2026
శ్రీనగర్: మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు, లోక్‌సభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్ వల్లభనేని బాలశౌరి జమ్మూ కశ్మీర్ పర్యటనలో భాగంగా శ్రీనగర్ చేరుకున్నారు.
అక్టోబర్ 9 నుంచి 14 వరకు జమ్మూ కశ్మీర్‌లోని గుల్మార్గ్, శ్రీనగర్ ప్రాంతాల్లో నిర్వహించనున్న సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ అధ్యయన పర్యటనలో ఆయన పాల్గొననున్నారు.
శ్రీనగర్ విమానాశ్రయానికి చేరుకున్న ఎంపీ బాలశౌరికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సీనియర్ అధికారులు ఘన స్వాగతం పలికారు.
ఈ అధ్యయన పర్యటనలో భాగంగా కమిటీ వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించనుంది. సంబంధిత అంశాలపై సమీక్షించి, అవసరమైన సమాచారాన్ని సేకరించడంతో పాటు ఆయా అంశాలపై అధ్యయనం చేయనుంది.
లోక్‌సభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్‌గా బాలశౌరి ఈ పర్యటనలో పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







