విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- October 09, 2026
విజయవాడ: విజయవాడ ఎన్టీఆర్ సర్కిల్ సమీపంలోని మారిస్ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో గాంధీ శిల్ప బజార్‌ను ( ప్రత్యేక ప్రదర్శన, అమ్మకం) శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ వైస్‌చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ విశ్వ మనోహరన్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పీ.సిసోడియా ముఖ్య అతిథిగా హాజరు కానుండగా, సంస్థ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ప్రదర్శనను ప్రారంభించనున్నారు.
కేంద్ర హస్తకళల అభివృద్ధి కమిషనర్, కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ సహకారంతో అక్టోబర్ 18 వరకు ఈ ప్రదర్శన నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన సుమారు 70 మంది కళాకారులు, చేతివృత్తిదారులు ఇందులో పాల్గొంటారు. కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మలు, కలంకారీ, చెక్క శిల్పాలు, టెర్రకోట, తోలుబొమ్మలు, క్రోషే లేస్ తదితర సంప్రదాయ హస్తకళా ఉత్పత్తులను ప్రత్యేకంగా ప్రదర్శించి విక్రయించనున్నారు.
ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రదర్శన అందుబాటులో ఉంటుందని విశ్వ మనోహరన్ తెలిపారు. నగర ప్రజలు పెద్ద సంఖ్యలో శిల్పి బజార్ ను సందర్శించి కళాకారులను ప్రోత్సహించాలని ఆయన కోరారు.
తాజా వార్తలు
- దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ 2026.. డిసెంబర్ 4 నుంచి 45 రోజుల పాటు సందడే సందడి!
- ఎన్విడియా సీఈవోగా మళ్లీ జెన్సన్ హువాంగ్
- సౌదీ–కువైట్ నేతల మధ్య కీలక చర్చలు
- బుల్లెట్ రైలు ట్రయల్ రన్ పై అశ్విని వైష్ణవ్ కీలక అప్డేట్
- యూఏఈ 55వ ఈద్ అల్ ఎతిహాద్ వేడుకలకు ఐదు రోజుల సంబరాలు..
- ఆఫీసు కంప్యూటర్లలో వాట్సాప్ వాడకంపై కేంద్రం హెచ్చరిక
- తమకు జరిగిన నష్టానికి అమెరికా బాధ్యత వహించాలి: ఇరాన్
- యూఏఈలో ప్రభుత్వ సేవలకు ఏఐ అసిస్టెంట్ ‘మీరా’..!!
- ఒమన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి, 17 మందికి గాయాలు..!!
- కువైట్‌లో నవంబర్ 30న అంతర్జాతీయ స్టార్టప్ పోటీ..!!







