'మనలో ఒకడు' టీజర్‌ విడుదల

- August 24, 2016 , by Maagulf
'మనలో ఒకడు' టీజర్‌ విడుదల

ఆర్పీ పట్నాయక్‌ కథానాయకుడిగా నటిస్తున్న 'మనలో ఒకడు' చిత్ర టీజర్‌ బుధవారం విడుదలైంది. మీడియా ప్రధానాంశంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా టీజర్‌ను రామోజీ గ్రూప్‌ సంస్థల అధినేత రామోజీరావు లాంఛనంగా విడుదల చేశారు. ఆర్పీ పట్నాయక్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలుపుతూ.. టీజర్‌ను పోస్ట్‌ చేశారు. కొన్ని నిజజీవిత కథల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు పేర్కొన్నారు. అనిత, శ్రీముఖి, సాయికుమార్‌, నాజర్‌, తనికెళ్ల భరణి, సురేష్‌ బెనర్జీ తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. స్క్రీన్‌ప్లే, దర్శకత్వ బాధ్యతలను ఆర్పీ పట్నాయక్‌ నిర్వర్తిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com