ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- October 09, 2026
దోహా: ఖతార్‌లో జరగనున్న రెండు అతిపెద్ద మోటార్‌స్పోర్ట్స్ ఈవెంట్లలో వాలంటీర్లుగా పనిచేసేందుకు లుసైల్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ (LIC) నమోదు ప్రక్రియను ప్రారంభించింది. 2026 MotoGP ఖతార్ ఎయిర్వేస్ గ్రాండ్‌ప్రి నవంబర్ 6 నుంచి 8 వరకు, ఫార్ములా 1 ఖతార్ ఎయిర్ వేస్ ఖతార్ గ్రాండ్ ప్రిక్స్ నవంబర్ 27 నుంచి 29 వరకు జరగనున్నాయి. వాలంటీర్ల నమోదు ప్రక్రియ అక్టోబర్ 8 నుంచి 18 వరకు కొనసాగుతుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు రెండు ఈవెంట్లలో ఏదో ఒకదానికి లేదా రెండింటికీ దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హతలు ఏమిటీ?
వాలంటీర్‌గా పనిచేయాలనుకునే అభ్యర్థులు కింది అర్హతలు కలిగి ఉండాలి.
* కనీసం 18 ఏళ్లు నిండి ఉండాలి.
* ఖతార్ పౌరులు లేదా ఖతార్‌లో నివసిస్తున్నవారై ఉండాలి.
* 2026 డిసెంబర్ 10 వరకు చెల్లుబాటయ్యే ఖతార్ ఐడీ (QID) కలిగి ఉండాలి.
* దరఖాస్తు చేసుకున్న ఈవెంట్‌కు సంబంధించిన అన్ని రేస్ రోజుల్లో అందుబాటులో ఉండాలి.
గతేడాది 107 దేశాలకు చెందిన 665 మంది వాలంటీర్లు
రెండు మోటార్‌స్పోర్ట్స్ ఈవెంట్లకు ఒకే వాలంటీర్ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా స్థానిక ప్రతిభను ప్రోత్సహించడం, సమాజ భాగస్వామ్యాన్ని పెంచడం, వైవిధ్యం మరియు సమాన అవకాశాలకు ప్రాధాన్యం ఇవ్వడం లక్ష్యంగా లుసైల్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ పనిచేస్తోంది.
2025లో జరిగిన ఫార్ములా-1 ఖతార్ గ్రాండ్‌ప్రిలో మొత్తం 107 దేశాలకు చెందిన 665 మంది వాలంటీర్లు పాల్గొన్నారు. వీరిలో 66 శాతం మంది పురుషులు కాగా, 34 శాతం మంది మహిళలు ఉన్నారు.
అంతర్జాతీయ ఈవెంట్లలో పనిచేసే అవకాశం
ఈ ఏడాది వాలంటీర్లుగా ఎంపికైన వారికి అంతర్జాతీయ స్థాయి మోటార్‌స్పోర్ట్స్ ఈవెంట్ల నిర్వహణలో ప్రత్యక్ష అనుభవం లభిస్తుంది. అనుభవజ్ఞులైన ఈవెంట్ నిపుణులతో కలిసి పనిచేసే అవకాశం ఉండటంతో పాటు, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి, భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలకు ఉపయోగపడే రెజ్యూమ్‌ను మెరుగుపరుచుకోవడానికి ఇది దోహదపడుతుంది.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా అక్టోబర్ 18లోపు దరఖాస్తు చేసుకోవాలి.
అధికారిక రిజిస్ట్రేషన్ లింక్: https://events.lcsc.qa/volunteer/
దరఖాస్తుల గడువు ముగిసిన తర్వాత ఎంపికైన అభ్యర్థులకు సమాచారం అందించి, తదుపరి నమోదు ప్రక్రియతో పాటు శిక్షణ కార్యక్రమాల వివరాలను తెలియజేస్తారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







