ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- October 09, 2026
హెచ్-1బి (H-1B) వీసా ఉద్యోగులకు గ్రీన్ కార్డ్ స్పాన్సర్‌షిప్‌ను అందించే శాశ్వత కార్మిక ధృవీకరణ (PERM) కార్యక్రమం నుండి పలు ప్రధాన ఐటీ సంస్థలను సస్పెండ్ చేస్తూ అమెరికా ప్రభుత్వం తీసుకున్న తీవ్ర నిర్ణయంపై భారత ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) అధికారికంగా స్పందించింది. అమెరికా ప్రభుత్వం విధించిన ఈ తాత్కాలిక నిషేధ ప్రకటనను తాము గమనించామని.. యూఎస్ కార్మిక శాఖ ఇచ్చే ప్రతీ ఆదేశానికి, నిబంధనకు టీసీఎస్ సంపూర్ణంగా కట్టుబడి ఉంటుందని శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో కంపెనీ స్పష్టం చేసింది. వ్యవస్థను దుర్వినియోగం చేశారనే ఆరోపణలతో డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యలు గ్లోబల్ టెక్ పరిశ్రమలో తీవ్ర దుమారం రేపిన నేపథ్యంలో టీసీఎస్ ఈ వివరణ ఇచ్చింది. అమెరికాలో తమ శ్రామిక శక్తి వ్యూహం, కార్యకలాపాలు ఎల్లప్పుడూ స్థానిక ప్రాతిపదికన, పటిష్టమైన క్యాంపస్ రిక్రూట్‌మెంట్ ఆధారంగానే సాగుతున్నాయని టీసీఎస్ తెలిపింది.
ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని కంపెనీ ధీమా
అమెరికా వ్యాప్తంగా ఉన్న తమ 31 కార్యాలయాలు, డెలివరీ కేంద్రాల్లో ఇప్పటికే అత్యధిక సంఖ్యలో స్థానిక ఉద్యోగులు సేవలందిస్తున్నారని వివరించింది. తమ స్థానిక శ్రామిక శక్తిని మరింత బలోపేతం చేయడానికి రాబోయే ఐదేళ్ల కాలంలో అమెరికాలో అదనంగా 15 వేల మంది స్థానిక అమెరికన్లను ఉద్యోగాల్లోకి తీసుకోనున్నట్లు కంపెనీ పునరుద్ఘాటించింది. గడిచిన రెండేళ్ల కాలంలో తమ PERM దరఖాస్తులు కేవలం ఒంటి అంకె (Single Digit) పరిమితికే పరిమితమయ్యాయని.. కాబట్టి ఈ ప్రోగ్రామ్ నిలిపివేత వల్ల తమ వ్యాపార వ్యూహాలపైగానీ, క్లయింట్ సంబంధాలపైగానీ ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని కంపెనీ ధీమా వ్యక్తం చేసింది. అమెరికా కార్మిక శాఖ చేపట్టిన ఈ ఊహించని సస్పెన్షన్ వేటు కేవలం టీసీఎస్‌పైనే కాకుండా కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సిఎల్ (HCL), క్యాప్‌జెమినిలతో పాటు అమెరికా టెక్ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్, అడోబ్‌లపై కూడా పడింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







