దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- October 09, 2026
న్యూ ఢిల్లీ: విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం (ఇంద్రకీలాద్రి) దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు సర్వాంగ సుందరంగా విద్యుద్దీపాలంకరణతో ముస్తాబవుతోంది. ఈ నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 10 రోజుల పాటు అత్యంత వైభవంగా జరగనున్న ఈ వేడుకల్లో అమ్మవారు రోజుకో ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉత్సవాల నేపథ్యంలో ఆలయ కమిటీ మరియు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేశారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, సీఎం చంద్రబాబు పర్యటన
ఈ ఏడాది ఉత్సవాల్లో భాగంగా అక్టోబర్ 14వ తేదీన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మవారిని దర్శించుకునేందుకు విజయవాడకు విచ్చేయనున్నారు. అలాగే అక్టోబర్ 16వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించనున్నారు.ఆసియా సంస్కృతి
20 లక్షల మంది భక్తులు.. దర్శన టికెట్లలో మార్పులు
ఈ ఏడాది సుమారు 20 లక్షల మందికి పైగా భక్తులు అమ్మవారి దర్శనార్థం ఇంద్రకీలాద్రికి తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సామాన్య భక్తులకు వేగవంతంగా దర్శనం కల్పించేందుకు రూ.100, రూ.300 మరియు రూ.500 దర్శన టికెట్ల జారీని 10 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. సామాన్య క్యూ లైన్లకు ప్రాధాన్యత ఇస్తూనే, రూ.1000 శీఘ్రదర్శనం టికెట్లను మాత్రం ‘మన మిత్ర’ వాట్సాప్ సేవ ద్వారా విడతలవారీగా భక్తులకు అందుబాటులో ఉంచనున్నట్లు ఆలయ అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







