గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- October 10, 2026
గుల్మార్గ్, కాశ్మీర్: లోక్‌సభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ అధ్యయన పర్యటనలో భాగంగా రెండో రోజు తొలి సమావేశం కాశ్మీర్‌లోని గుల్మార్గ్లో నిర్వహించారు. ఈ సమావేశానికి లోక్‌సభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్, ఎంపీ వల్లభనేని బాలశౌరి అధ్యక్షత వహించారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రతినిధులతో ఈ సమావేశం జరిగింది.
సమావేశానికి ముందు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మేనేజింగ్ డైరెక్టర్ రవి రంజన్, కెనరా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓ బి.కె. సింగ్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం.పరమశివం ఎంపీ బాలశౌరికి మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు.
కమిటీ అధ్యయన పర్యటనలో భాగంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రతినిధులతో నిర్వహించిన ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పర్యటన ద్వారా సంబంధిత అంశాల పై కమిటీ అధ్యయనం కొనసాగిస్తోంది.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







