కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- October 10, 2026
ఫహాహీల్: కువైట్‌లోని ఫహాహీల్ మార్కెట్లో నిర్వహించిన తనిఖీల్లో మానవ వినియోగానికి పనికిరాని 773 కిలోల చేపలను అధికారులు ధ్వంసం చేశారు. ప్రజారోగ్యం, ఆహార భద్రతను కాపాడే లక్ష్యంతో చేపలు, కూరగాయలు, మాంసం విక్రయించే మార్కెట్లలో సంయుక్త తనిఖీల కార్యక్రమాన్ని చేపట్టారు.
కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఆధ్వర్యంలో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ, మత్స్యశాఖ అధికారుల సమన్వయంతో ఈ తనిఖీలు నిర్వహించారు.
మార్కెట్లో ప్రజారోగ్య పరిశుభ్రత నిబంధనలు, నిర్దేశిత ప్రమాణాలు పాటించని వారిపై అధికారులు నాలుగు ఉల్లంఘన నివేదికలు జారీ చేశారు. ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రత విషయంలో నిర్లక్ష్యం వహించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
ప్రజలకు సురక్షితమైన ఆహారం అందేలా సంబంధిత శాఖల సమన్వయంతో తనిఖీలను కొనసాగిస్తామని పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ వెల్లడించింది. ఆహార భద్రతా నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- UAE participates in 12th GCC Labour Minister’s Committee meeting in Bahrain
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం







