ఏపీ ప్రజలకు అలెర్ట్
- October 10, 2026
అమరావతి: ఆంధ్రప్రదేశ్, యానాం పరిసర ప్రాంతాలలో రాబోయే మూడు రోజుల వాతావరణానికి సంబంధించి భారత వాతావరణ శాఖ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కీలక బులెటిన్‌ను విడుదల చేశాయి. దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా వీస్తున్న వీచే గాలుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఇదే సమయంలో తెలంగాణలో రుతుపవనాలు నిష్క్రమించడంతో సాధారణ వాతావరణం నెలకొంటుందని స్పష్టం చేశారు.
కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఈదురుగాలులతో కూడిన జల్లులు:
ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, శనివారం కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి జల్లులు(Rain Alert) పడే అవకాశం ఉంది. అలాగే ఆది, సోమవారాల్లో రాష్ట్రంలోని పలు చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీర ప్రాంత ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
తెలంగాణలో ఆహ్లాదకరమైన వాతావరణం.. మధ్యాహ్నం వేడి:
మరోవైపు తెలంగాణలో నైరుతి రుతుపవనాలు పూర్తిగా నిష్క్రమించడంతో భారీ వర్ష సూచన ఏమీ లేదని వాతావరణ శాఖ పేర్కొంది. రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలో ఒకటి రెండు చోట్ల తేలికపాటి చినుకులు తప్ప పెద్దగా వర్షాలు ఉండకపోవచ్చని స్పష్టం చేసింది. ఫలితంగా ఉదయం, సాయంత్రం వేళల్లో వాతావరణం ఆహ్లాదకరంగా చల్లగా ఉంటుందని, అయితే మధ్యాహ్నం వేళల్లో కొద్దిపాటి ఎండ మరియు ఉక్కపోత ప్రభావం కొనసాగుతుందని వాతావరణ శాఖ వివరించింది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







