'బ్లడీ రోమియో' కోసం నేచురల్ స్టార్ నాని అల్ట్రా-స్టైలిష్ మేకోవర్
- October 10, 2026
నేచురల్ స్టార్ నాని తన నెక్స్ట్ భారీ ఎంటర్టైనర్ ‘బ్లడీ రోమియో’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ‘ఓజీ’ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నాని, సుజీత్ కాంబినేషన్లో వస్తున్న తొలి చిత్రం.డార్క్ హ్యూమర్, ఎక్సయిటింగ్ యాక్షన్, విలక్షణమైన పాత్రలతో ఈ సినిమా ప్రేక్షకులను అలరించనుంది. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన లభించడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. వెంకట్ బోయనపల్లి నిహారిక ఎంటర్టైన్మెంట్, యునానిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది.
‘బ్లడీ రోమియో’ కోసం నాని తన సరికొత్త లుక్‌ను పరిచయం చేశారు. మేకోవర్‌కు సంబంధించిన వీడియోను విడుదల చేస్తూ, తన ప్రత్యేకమైన స్క్రీన్ పర్సనాలిటీని తీర్చిదిద్దడం వెనుక జరిగిన కృషిని ప్రజెంట్ చేశారు. ఇంతవరకు ప్రేక్షకులకు పరిచయమైన తన లుక్కు భిన్నంగా, ఈసారి నాని రెట్రో స్టైల్లో బోల్డ్ మేకోవర్‌తో కనిపిస్తున్నారు. సినిమా కథకు, పాత్ర స్వభావానికి తగ్గట్టుగా ఈ లుక్‌ను రూపొందించారు.
ప్రముఖ సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ ఆలీమ్ హకీమ్ నాని మేకోవర్‌ను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. కర్లీ ముల్లెట్ హెయిర్‌స్టైల్, టెక్స్చర్డ్ లేయర్స్‌తో పాటు రఫ్‌గా కనిపించే ఫుల్ బియర్డ్‌తో నానికి సరికొత్త లుక్ లో కనిపించారు. డిఫరెంట్ హెయిర్‌స్టైల్ నానికి రెబల్ లుక్‌ను తీసుకొచ్చింది. ఆయన పోషిస్తున్న పాత్రకు ప్రత్యేకమైన యాటిట్యూడ్, పర్సనాలిటీ ఉన్నాయనే ఆసక్తిని ఈ లుక్ కలిగిస్తోంది.
తన హీరోలను స్టైలిష్‌గా చూపించడంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సుజీత్.. ఆలీమ్ హకీమ్ సెలూన్లో జరిగిన ఈ మేకోవర్ సెషన్‌ను స్వయంగా పర్యవేక్షించారు. సినిమాలోని పాత్రకు అనుగుణంగా ప్రతి అంశాన్ని జాగ్రత్తగా రూపొందించారు. ఈ వీడియోలో నాని పాత్రకు సంబంధించిన ప్రత్యేకమైన యాక్సెసరీస్‌తో ప్రయోగాలు చేయడం కూడా కనిపిస్తుంది. రౌండ్ డార్క్ సన్‌గ్లాసెస్, భారీ బుట్చర్ అప్రాన్, మాంసం కోసే క్లీవర్ కత్తి వంటి ఆసక్తికరమైన అంశాలు ఇందులో ఉన్నాయి. వీటితో నాని పోషించబోయే పాత్ర ప్రపంచం ఎంత విలక్షణంగా ఉండబోతోందో అర్థమవుతోంది. ఈ సినిమాలో ఆయన చెఫ్‌గా, గ్యాంగ్‌స్టర్‌గా రెండు విభిన్న కోణాల్లో కనిపించనున్నారు.
మేకోవర్ పూర్తయిన తర్వాత నాని తన పూర్తి లుక్‌లో అలరించారు. ఆయన ముఖంలో కనిపించే ఇంటెన్స్ ఎక్స్ప్రెషన్స్ పాత్రలోని డేంజర్ నేచర్ ను మరింత స్పష్టంగా చూపిస్తున్నాయి. ప్రతి చిన్న డిటెయిల్ ను జాగ్రత్తగా రూపొందించిన ఈ లుక్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్లో నాని నటన ఎలా ఉండబోతోందనే అంచనాలు ఏర్పడుతున్నాయి.
నాని సరికొత్త మేకోవర్, సుజీత్ ప్రత్యేకమైన మేకింగ్ స్టైల్ కలగలిసి ‘బ్లడీ రోమియో’ ఆయన కెరీర్లో మరో మైల్ స్టోన్ చిత్రంగా నిలిపేందుకు సిద్ధమౌతోంది.
నటీనటులు: నేచురల్ స్టార్ నాని
సాంకేతిక బృందం:
రచన, దర్శకత్వం: సుజీత్
నిర్మాత: వెంకట్ బోయనపల్లి
బ్యానర్లు: నిహారిక ఎంటర్టైన్మెంట్, యునానిమస్ ప్రొడక్షన్స్
పీఆర్వో: వంశీ-శేఖర్
తాజా వార్తలు
- వికసిత్ భారత్'కు యువతే భవిష్యత్తు సంరక్షకులు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- ఖతార్‌లో ఘనంగా ‘పాసేజ్ టు ఇండియా 2026’.. నవంబర్ 26, 27 తేదీల్లో భారతీయ సాంస్కృతిక సంబరాలు
- రియాద్ పై హౌతీల దాడిని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- రియాద్ ఆర్థిక జిల్లాలోని టవర్ పై హౌతీ దాడి..11 మందికి గాయాలు
- డిసెంబర్ నుంచి కొత్త రూల్స్.. క్రెడిట్ కార్డు, గ్యాస్ ధరల్లో మార్పులు!
- నాలుగో ప్రపంచ తెలుగు మహాసభలకు పూర్వ గవర్నర్ కంభంపాటి హరిబాబుకు ఆహ్వానం
- రాస్ అల్ ఖైమా బస్సు ప్రమాదంలో మృతిచెందిన వారిలో భారతీయులు..
- గల్ఫ్టైనర్ గ్రూప్ సీఈఓతో భారత కాన్సుల్ జనరల్ భేటీ..
- రాస్ అల్ ఖైమాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 26 మందికి గాయాలు
- జీఎంఆర్ కార్గో నిల్వ సామర్థ్యం 140 శాతం పెంపు







