వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- October 10, 2026
– క్యాన్సర్ మందులను చౌకగా అందించే చర్యలు అభినందనీయం
– W4C 2026 సదస్సులో
హైదరాబాద్: వైద్య సేవలు వ్యాధుల చికిత్సకే పరిమితం కాకుండా.. రోగులు, వారి కుటుంబాల పట్ల విశ్వాసం, గౌరవం, ఆత్మీయతతో కూడి ఉండాలని తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అన్నారు. వైద్యులు రోగుల భావోద్వేగాలు, కుటుంబ పరిస్థితులను అర్థం చేసుకుంటూ సేవాభావంతో చికిత్స అందించాలని సూచించారు.
శనివారం హైటెక్ సిటీలోని యశోద ఆసుపత్రిలో నిర్వహించిన ఆరో ప్రపంచ సమగ్ర క్రిటికల్ కేర్ సదస్సు (W4C 2026)లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. వైద్య పరిజ్ఞానంతో పాటు మానవీయ దృక్పథం కూడా వైద్యుడి గొప్పతనాన్ని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు.
క్యాన్సర్ మందులు అందుబాటులోకి రావాలి
క్యాన్సర్ రోగులకు ఖరీదైన మందులను చౌకగా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని గవర్నర్ అన్నారు. వీటితో రోగులు, వారి కుటుంబాలకు ఆర్థికంగా ఊరట లభిస్తుందని పేర్కొన్నారు. ఔషధ రంగం, సమాజం, దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి అంశాలపై సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు.
సేవతోనే ప్రజలతో అనుబంధం
రాజకీయాలతో పాటు సమాజ సేవలోనూ భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును గవర్నర్ ప్రస్తావించారు. పదవులు శాశ్వతం కాకపోయినా.. సేవ ద్వారా ప్రజలతో ఏర్పడే అనుబంధం చిరకాలం నిలుస్తుందని అన్నారు.
అంతర్జాతీయ సహకారం, ఆధునిక పరిశోధనలతో భారతీయ పరిస్థితులకు అనుగుణమైన చికిత్సా విధానాలను అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు. సమర్థమైన వైద్య సేవలను అందరికీ అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. W4C 2026 సదస్సు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రోగుల చికిత్సలో సానుకూల మార్పులకు దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.సదస్సును నిర్వహించిన యశోద ఆసుపత్రులు, ఇండియన్ సొసైటీ ఆఫ్ క్రిటికల్ కేర్ మెడిసిన్, నిర్వాహకులకు అభినందనలు తెలిపారు.
అంతకుముందు లోక్ భవన్ లో
తెలంగాణలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యకలాపాలు, విజయాలపై పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు డా. నవీన్ నికోలస్ గవర్నర్‌ను కలిసి వివరించారు.
ఈ సందర్భంగా గత ఏడాది కాలంలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ నిర్వహించిన కార్యక్రమాలు, చేపట్టిన సేవా కార్యక్రమాలు, సాధించిన విజయాలను గవర్నర్‌కు వివరించారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







