‘కామ్రేడ్ కళ్యాణ్’కు వర్డ్ ఆఫ్ మౌత్ చాలా పాజిటివ్‌గా స్ప్రెడ్ అవుతోంది: హీరో శ్రీ విష్ణు
- October 10, 2026
కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్’ శ్రీ విష్ణు నవ్వుల బ్లాక్‌బస్టర్ ‘కామ్రేడ్ కళ్యాణ్’. జనకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కోన వెంకట్ సమర్పించగా, స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై వెంకట కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మించారు. మహిమా నంబియార్ కథానాయికగా నటించారు. అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను అందుకుంటూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ‘నవ్వుల నవరాత్రులు’ బ్లాక్‌బస్టర్ సక్సెస్ మీట్ నిర్వహించింది.
సక్సెస్ మీట్ లో హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ‘కామ్రేడ్ కళ్యాణ్’ సినిమాకి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. వర్డ్ ఆఫ్ మౌత్ చాలా పాజిటివ్‌గా స్ప్రెడ్ అవుతోంది. మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అంటూ ప్రేక్షకులు చాలా మంచి స్పందన ఇస్తున్నారు. దసరా పండుగకు ఫ్యామిలీస్ అందరూ కలిసి ఈ సినిమాని హ్యాపీగా చూడొచ్చు. రెండు గంటల పాటు కడుపునిండా హాయిగా నవ్వుకోవాలనే ఉద్దేశంతో తీసిన సినిమా ఇది. లక్కీగా దసరాకు రావడం, అందరికీ సెలవులు ఉండటం చాలా ఆనందంగా ఉంది. ఆడియన్స్ అందరూ హ్యాపీగా థియేటర్‌కి వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు. చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇది ఇలాగే కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఈ సినిమా చూసి ఒక పెద్ద హీరో కాల్ చేసి సినిమాని మెచ్చుకున్నారు. నెక్స్ట్ ఈవెంట్స్ లో ఆయన వస్తారు. అది ప్రస్తుతానికి సర్‌ప్రైజ్‌గా ఉంచుతున్నాం. ఆచార్య దళం డైలాగ్‌కి థియేటర్‌లో చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. కోన గారు ఈ ఐడియా చెప్పినప్పుడే నేను చిరంజీవి గారిని అడగమని చెప్పాను. ఆయనకి ఈ సీన్ గురించి చెప్పిన తర్వాత పగలబడి నవ్వారు. సినిమా మొత్తానికి ఇదే హైలైట్ అవుతుందని చెప్పారు. థియేటర్‌లో నిజంగా ఆయన చెప్పినట్టుగానే ఆ సీన్‌కి వచ్చిన రియాక్షన్ చూస్తే అద్భుతంగా ఉంది.
ఈ సినిమా కోసం థియేటర్ విజిట్స్ చేయబోతున్నాం. రేపటి నుంచి ప్లాన్ చేస్తాం. రాధిక గారి క్యారెక్టర్‌కి కూడా చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. బాలకృష్ణ గారి ఫ్యాన్స్ నుంచి కూడా మంచి కాల్స్ వచ్చాయి. ఇందులో ఒక సీరియస్ టాపిక్ కూడా ఉంది. అది నేను చిన్నప్పుడు విన్నాను. అది నాకు నచ్చింది. దాన్ని ఒక ఫన్ ఎంటర్‌టైనర్‌లా చేసి చూపించాం. అది ఆడియన్స్‌కి చాలా నచ్చింది.
కోన వెంకట్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. సినిమాకి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. థియేటర్లలో నవ్వుల వర్షం కురిపిస్తున్నారు. సినిమాకి అన్ని చోట్ల నుంచి కూడా చాలా మంచి మౌత్ టాక్ వస్తోంది. ఒక సీరియస్ టాపిక్ అయినప్పటికీ, దీన్ని ఫన్ ఎంటర్‌టైనర్‌లా చూపించడం ప్రేక్షకులకు నచ్చడం చాలా ఆనందాన్నిచ్చింది. ఈ సినిమా కోసం ఒక జాతర ఎపిసోడ్ షూట్ చేశాం. కాకపోతే అది కథా ప్రవాహానికి అడ్డు వస్తుందని, వెన్నెల కిషోర్ గారితో ఒక స్పెషల్ ట్రాక్ చేయించాం. దానికి కూడా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాకి నిర్మాతగా, రైటర్‌గా ఉన్నాను. కాకపోతే నాకు ఎక్కువ సంతోషాన్ని ఇచ్చింది రచయితగానే. నిజంగా నేను రచయితగానే వచ్చాను. రచయితగా ఉండటమే నాకు ఆసక్తి, ఆనందం. కాకపోతే కొన్ని కథల కోసం కొంతమందిని పరిచయం చేయడానికి నేను నిర్మాతగా మారాల్సి వచ్చింది. ఈ దసరా పండుగకు అందరూ ఫ్యామిలీతో కలిసి థియేటర్‌లో అద్భుతంగా ఎంజాయ్ చేసే సినిమా ‘కామ్రేడ్ కళ్యాణ్’. ఈ వేడుకలో సినిమా యూనిట్ అందరూ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







