రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- October 11, 2026
రియాద్: సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై శనివారం, అక్టోబర్ 10 మధ్యాహ్నం దాడి జరిగినట్లు సౌదీ అరేబియా జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (GACA) వెల్లడించింది. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు తెలిపింది.
దాడి నేపథ్యంలో విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు ప్రకటించారు. విమానాశ్రయానికి జరిగిన నష్టాన్ని అంచనా వేయడంతో పాటు, విమానాశ్రయ సదుపాయాల భద్రతను నిర్ధారించేందుకు సంబంధిత అధికారులతో కలిసి చర్యలు చేపట్టినట్లు GACA పేర్కొంది.
ప్రయాణికులు, విమానాశ్రయ సిబ్బంది భద్రతకు సంబంధించిన అంశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపింది. పరిస్థితిపై సమీక్ష పూర్తయిన తర్వాత తదుపరి వివరాలను వెల్లడిస్తామని అధికారులు పేర్కొన్నారు.
దాడికి సంబంధించిన పూర్తి వివరాలు, గాయపడిన వారి సంఖ్య, విమాన కార్యకలాపాలు తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతాయనే అంశాలపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







